... కె సిఆర్ ఖబర్దార్...!.నీ భరతం పడుతాం ..
- పేలుతున్న ఈటల మాటల తూటాలు
- ...కేంద్రం అండతో పెంచిన వాయిస్
- ...ఎలక్షన్ కమిషన్ కేంద్రం చేతిలోనే
- ..హుజురాబాద్ లో ఆటలు సాగవు
- .. మీ భరతం పడతాం: ఈటల హెచ్చరికలు
ఏఆర్ మీడియా /ఏసీయన్ మీడియా
By: K. Ashok reddy.
Sr. Journalist,
హైదరాబాద్ జూన్ 19
ఇన్నాళ్లు కొంత మెతక వైఖరి అవలంబిస్తూ వస్తున్న ఈటల రాజేందర్ గత రెండు రోజుల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం లో నిర్వహిస్తున్న పలు సభలు, సమావేశాల్లోతెలంగాణప్రభుత్వం పై మాటల తూటాలను పేల్చుతున్నారు. సమరానికి సై అంటూ, మీ భరతం పట్టే రోజులు దగ్గరపడ్డాయని తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో నుంచే తిరిగి వారికి సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వాలు డబ్బులు చెల్లిస్తాయని, వీటిని, ఎవరికీ ఆపే దమ్ము ధైర్యం లేదని ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు డబ్బుల మూటలతో హుజూరాబాద్ నియోజకవర్గంలోతిరుగుతూఎరవేస్తున్నారని ధ్వజ మెత్తారు. మీ డబ్బుల సంచులు హుజురాబాద్ లో పనిచేయవని "ఆత్మ గౌరవ నినాదం" పై ఇలాంటి చిల్లరపనులు సరితూగవని హెచ్చరించారు.
ఏనాడు హుజురాబాద్ ముఖం చూడని మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బుల సంచులు పట్టుకునిగ్రామాల్లోతిరిగితేఓట్లురాలుతాయానే భ్రమల నుంచి బయటపడితే మంచిదని హితవు పలికారు.
నాయకుల పై ఘాటైన విమర్శలు:
డబ్బుల సంచులు పట్టుకుని వచ్చే నాయకుల చరిత్ర అంతా తనకు తెలుసని ఈటల రాజేందర్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల సందర్భంగా కుట్రలు కుతంత్రాలు చేసి అధికార మదం తో ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్ లను, ఎమ్మార్వో లను బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బదిలీలు ఎన్ని చేసినా, వచ్చిన కొత్తవారు కూడా, ఈ అధికార మదంతో ఉన్న ప్రభుత్వాన్ని పతనం చేయాలనే ఆత్మగౌరవం వారిలోఉందనితెలుసుకోలేని దగుల్బాజీలనిదుయ్యబట్టారు.హుజరాబాద్ నియోజకవర్గానికి ఉరికి ఉరికి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులను వాళ్ల ఇళ్లల్లో ఉన్న వాళ్లు సైతం చీదరించుకునే పరిస్థితి వచ్చిందని ఎగతాళి చేశారు.
ఉప ఎన్నికల్లో అక్రమాలు చెల్లవు:
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార బలంతో కుట్రలు పన్ని, నెగ్గాలి అనుకునే కుతంత్రాలు అడ్డుకుంటామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల పై గట్టినిఘాపెట్టిఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు
. ఎమ్మెల్యే ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయని,అందువల్ల, రాష్ట్రప్రభుత్వంచేసేకుట్రలు,కుతంత్రాలను అడ్డుకొని ప్రజాస్వామ్యబద్ధంగా తమ గెలుపు కాయం అవుతుందని . ధీమా వ్యక్తం చేస్తున్నారు
అంటే వచ్చే ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిషిత దృష్టిని పెట్టి రాష్ట్రప్రభుత్వ కుట్రలు కుతంత్రాలను అడ్డుకుంటుందని చెప్పకనే చెప్పారు. దీంతో తన గెలుపు సులభతరం అవుతుందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. అందుకే స్వరంపెంచిఘాటుగాదీటైనసమాధానాలుచెబుతున్నారు
మళ్లీ తెరపైకి మానుకోట:
మానుకోటలో సమైక్యాంద్ర నాయకుల పై చేసిన రాళ్ల దాడిని మరోసారి ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ప్రాణాలకు తెగించి ఆనాటి మానుకోట యుద్ధాన్ని హుజురాబాద్ చేసిందని చెప్పారు.
అలాంటి వీరోచిత తెగువను చూపి న యువత తన వైపు ఉన్నారని చెప్తున్నారు. మానుకోటలో అసలు ఏం జరిగింది..? ఎందుకు దాడి చేయవలసి వచ్చింది..? అనే అంశాలను పరిశీలిస్తే ఆనాడు, తెలంగాణ ఈ ప్రాంతంలో ఆంధ్ర నాయకులు పర్యటించడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక్క పిలుపుతో ఆంధ్ర నాయకులను తెలంగాణలో కాలు పెట్టకుండా అడ్డుకున్నారు
. ఆనాడు సమైక్యవాది అయిన జగన్మోహన్ రెడ్డి మానుకోట పర్యటన సందర్భంగా తెలంగాణ యువత మూకుమ్మడిగా రాళ్ల దాడి చేసి తరిమితరిమి కొట్టారు. ఆనాడు తరిమి తరిమి కొట్టిన జగన్మోహన్రెడ్డిని, ఈనాడు తెలంగాణ సీఎం ఏ రకంగా దోస్తీ కడతాడు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.

Comments
Post a Comment