హుజురా బాద్ లో అలక బాట పట్టిన కమల దళాలు

హుజురాబాద్ లో మోడీ చరిష్మా పని చేయదా..? ప్రధాని పేరు చెబితే ఓట్లు పడవా ...? "జై శ్రీరామ్", "వందేమాతరం" నినాదాలు ఏవి ..?భారత్ మాతా కి జై అంటే అవమానమా..? ..ఈటల ప్రచారంలో ఊసే లేని బిజెపి నినాదాలు ..దూరమవుతున్న పాత బీజేపీ శ్రేణులు By: K. Ashok Reddy,Sr. Journalist .ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా హైదరాబాద్ : హైద్రాబాద్ జూన్ 24, రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార హోరులో బిజెపి ప్రచార తగ్గిందా... ? ఆ పార్టీ బ్రాండ్ గా గున్న నినాదాలు ప్రజలను ఉర్రూతలూగించే జోరు నుంచి తప్పుకున్నాయా..? బిజెపి మీ ఐకాన్ ప్రధాని "నరేంద్ర మోడీ" పేరు చెబితే ఓట్లు రాలవా..? అసలు ఆయన చరిష్మా తగ్గిపోయింది అనుకుంటున్నారా..? బిజెపి నినాదాలు వల్లిస్తే నామోషీగా ఫీల్ అవుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. . హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల సభలు సమావేశాలు చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈటల నిర్వహిస్తున్న సభలు సమావేశాల్లో బీజేపీకి జోష్ తెచ్చే 'భారత్ మాతాకీ జై", " జై శ్రీరాం", 'వందేమాతరం' వంటి నినాదాలు కాన...