హుజురాబాద్ లో మోడీ చరిష్మా పని చేయదా..?
ప్రధాని పేరు చెబితే ఓట్లు పడవా ...?
"జై శ్రీరామ్", "వందేమాతరం" నినాదాలు ఏవి ..?భారత్ మాతా కి జై అంటే అవమానమా..?
..ఈటల ప్రచారంలో ఊసే లేని బిజెపి నినాదాలు
..దూరమవుతున్న పాత బీజేపీ శ్రేణులు
By: K. Ashok Reddy,Sr. Journalist
.ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా హైదరాబాద్ :
హైద్రాబాద్ జూన్ 24,
రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార హోరులో బిజెపి ప్రచార తగ్గిందా... ? ఆ పార్టీ బ్రాండ్ గా గున్న నినాదాలు ప్రజలను ఉర్రూతలూగించే జోరు నుంచి తప్పుకున్నాయా..? బిజెపి మీ ఐకాన్ ప్రధాని "నరేంద్ర మోడీ" పేరు చెబితే ఓట్లు రాలవా..? అసలు ఆయన చరిష్మా తగ్గిపోయింది అనుకుంటున్నారా..? బిజెపి నినాదాలు వల్లిస్తే నామోషీగా ఫీల్ అవుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల సభలు సమావేశాలు చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈటల నిర్వహిస్తున్న సభలు సమావేశాల్లో బీజేపీకి జోష్ తెచ్చే 'భారత్ మాతాకీ జై", " జై శ్రీరాం", 'వందేమాతరం' వంటి నినాదాలు కాన రావడం లేదు. ముఖ్యంగా బిజెపికి అండదండగా నిలిచే యువతను ఈ నినాదాలే తట్టి లేపుతాయి అనడంలో సందేహం లేదు. ఎంతో ఊపును ఇచ్చి ప్రచార పర్వాన్ని రక్తికట్టించే ఈ నినాదాలు ప్రస్తుతం కనుమరుగైపోయాయి. 
ఈటల వర్గం నేతలు బిజెపి బ్రాండ్ నినాదాలను పలకడంలో ఇబ్బంది పడుతున్నారా..? లేక ఆ నినాదాల వల్ల నష్టం జరుగుతుందని భావిస్తున్నారా ..? అనే విషయాలు అంతుపట్టని విధంగా ఉన్నాయి. కనీసం 'బిజెపి జిందాబాద్' అనే నినాదాలు కూడా చేయకుండా "జై ఈటల" "జై జై ఈటల' అనే స్లోగన్లు ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి పేరు పైనే ఓట్లు పడతాయని ఈటెల వర్గం నమ్ముతున్నట్లు వారు వ్యవహరిస్తున్న తీరు తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అందజేస్తున్న నిధుల విషయమై ఈటల సభలు సమావేశాల్లో ప్రస్తావన చేయడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర నిధులే ప్రస్తుతం ఆదుకుంటు న్నాయని బిజెపి నేతలు చెబుతున్నప్పటికీ, హుజురాబాద్ లో మాత్రం ఈ విషయం ఎందుకు ప్రస్తావించడం లేదనే ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు
. కాగా రాష్ట్ర బిజెపి నాయకత్వ నినాదాలు లేకపోవడం భారీగా పార్టీకి నష్టం చేస్తుందని ఆ పార్టీ పాత నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం తో పాటు, కేంద్ర నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ ప్రచార పర్వంలో ముందుకు సాగుతారు. కానీ, ఈటల సభలు సమావేశాల్లో బిజెపి అధినేతల ప్రస్తావన తీసుకురాకుండా, తనకు, సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని.. మంత్రి పదవి నుంచి కూడా పీకారని.. ఘోరంగా అవమానించారని... అందుకే ఆత్మగౌరవ బావుటా ఎగర వేస్తున్నా.. అని ఈటల చెప్పటం బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు
. బిజెపి పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచే నాయకుడే, ఆ పార్టీ మూల సిద్ధాంతమైన నినాదాలను పక్కన పెట్టి, వ్యక్తిగత ఇమేజిని ప్రజల ముందు ఉంచడం వల్ల ఓట్లు రాబట్టుకోవాలని ఆలోచన చేయడం బీజేపీ నేతలకు సుతారం నచ్చడం లేదు.
ముసుగు గా బీజేపీ కండువా :
హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ ఏర్పాటు చేస్తున్న సభలు సమావేశాల్లో పార్టీ పటిష్టత కు ఎలాంటి ఆస్కారం లేకుండా, వ్యక్తిగత ప్రచారం చేయడం బీజేపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆ పార్టీ కండువా ఒక రక్షణనిచ్చే కవచం గా మార్చుకుంటున్నారు తప్ప, పార్టీ కోసం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర బిజెపి నేతలు ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకుంటే పార్టీ బలపడుతుంది. వచ్చే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఒక వేదికగా మలుచుకోవాలని ఆశించింది.
అయితే అందుకు అనుగుణంగా హుజురాబాద్ లో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రస్థాయి పార్టీ నేతలు కొందరు, కేంద్ర నాయకత్వానికి హుజరాబాద్ లో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు తెలుస్తుంది. పరిస్థితి ఇలాగే ఉంటే, ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆశించిన ప్రయోజనం అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈటల రాజేందర్ కు బిజెపి అండగా నిలిచినప్పటికీ ఆయనపై పార్టీ పెట్టుకున్న అంచనాలను ఫలితాల రూపంలో రా బట్టలేని పరిస్థితి నెలకొంది.
Comments
Post a Comment