తెలంగాణలో జర్నలిస్టులకు ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్*
AsianMedia/AR Media
Hyderabad
May 26, 2021
నెల 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్త జర్నలిస్టులకు ప్రత్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. సంబంధిత వ్యాక్సిన కేంద్రానికి అక్రిడేషన్ కార్డుతో పాటు ఆధార్‌కార్డును తీసుకువెళ్లాలన్నారు. జిల్లాల్లో వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు జిల్లా ప్రజా సంబంధాల అధికారి వద్ద అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
స్టేట్ లెవల్ జర్నలిస్టులకు నగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్, జూబ్లిహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ఇనిస్టిట్యూట్, చార్మినార్ వద్ద గల యునానీ ఆస్పత్రి, వనస్థలీపురంలో గల ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అరవింద్ కుమార్ కోరారు. మొత్తం 20 వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నట్లు వీరిలో 3,700 మంది స్టేట్ లెవల్ జర్నలిస్టులన్నారు.
Comments
Post a Comment