అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టుల కు ,కుటుంబసభ్యుల కు వ్యాక్సిన్.ఇవ్వాలి..తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డిమాండ్..

 ఏఆర్ మీడియా, హైదరాబాద్ : మే 26

.అక్రిడేషన్ లేని జర్నలిస్టులందరికీ  వాక్సిన్ ఇవ్వాలి....



..చిరు వ్యాపారుల కంటే అధ్వానమా..?..

 ...స్పైడర్లకి ఇచ్చిన విలువ జర్నలిస్టిక్ లేదా..?

 ..జర్నలిస్టుల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు ఎలా ..?

..జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలి

 ...తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డిమాండ్  


:రాష్ట్రంలో వివిధ ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న అక్రిడేషన్ లేని జర్నలిస్టులందరికీ కోవిడ్ వాక్సినేషన్ అందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (యు టి  జె)


 నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ నేతలు అమర్ సతీష్ కమాల్ అశోక్ రెడ్డి,గోపి యాదవ్ లు  విడుదల చేసిన ఒక ప్రకటనలో జర్నలిస్టు కుటుంబ సభ్యులకు సైతం వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోవిడ్ స్పైడర్ లను గుర్తించి వారికి ఉచితంగా కోవిడ్ వాక్సినేషన్ అందించాలని నిర్ణయించడం సముచితమే. ఈ స్పైడర్ విభాగంలో కిరాణా కొట్టు వ్యాపారులు, వీధుల్లో తిరిగే బండి కొట్టు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్, పెట్రోల్ పంపు లో పనిచేసే సిబ్బంది తదితరులను స్పైడర్ లుగా గుర్తించిన ప్రభుత్వం, ప్రాణాలకు తెగించి నిత్యం వార్తలను ప్రజల ముందు ఉంచే జర్నలిస్టులను ఎందుకు గుర్తించడం లేదు...? అక్రిడేషన్లు ప్రతి జర్నలిస్టుకు ఉండాలని రూలేమీ లేదు. అక్రిడేషన్ లేనప్పటికీ జర్నలిస్టులు తమ సంస్థల ఇచ్చిన ఐడి కార్డుల ద్వారా వార్తలను సేకరించి  ప్రజల ముందు ఉంచుతారు. ఇలాంటి జర్నలిస్టులను ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదు. జర్నలిస్టుకు అక్రిడేషన్ ఉన్నా లేకున్నా వార్తా సేకరణలో మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి  ముందు వరుసలో ఉంటాడు.

ఇలాంటి జర్నలిస్టులు కోవిడ్ సమయంలో విధి నిర్వహణలో ఉండి ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ కోవిడ్ బారినపడిన జర్నలిస్టులు దాదాపు 64 మంది మృత్యువాత పడ్డారు. మరో 800 మంది వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది అప్పుల పాలయ్యారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం కావటం లేదన్నారు. నిత్యం ప్రజాబాహుళ్యంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకే తమ జీవితాలను అంకితం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిని ఆపద నుంచి కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని యూటీ జె నేతలు ఆరోపించారు. అక్రిడేషన్ లేని 12000 జర్నలిస్టులు రాష్ట్రంలో వివిధ ప్రసార మాధ్యమాల్లో  పనిచేస్తున్నారని యూటీ జె నేతలు తెలిపారు

. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మొత్తం అక్రిడేషన్లు దాదాపు 20 వేల వరకు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా     ఐ అండ్ పి ఆర్ జారీచేసిన రాష్ట్రస్థాయి దాదాపు 3700 అక్రిడేషన్లు ఉన్నాయి. మిగితా 16340 అక్రిడేషన్లు వివిధ జిల్లాలు, మండలాల వారీగా ఉన్నాయి. వీరందరికీ ప్రభుత్వం  వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నట్లు గానే అక్రిడేషన్ లేని జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరచి స్పైడర్ ల కంటే మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం పని చేస్తున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్