ఈటల గుట్టువిప్పిన ఇంటి దొంగలు
... పిఏ, పిఆర్ఓ లే కోవర్టులా..!
... తిన్న ఇంటికే కన్నం
... కాంగ్రెస్ నేతకు ఉప్పందిస్తున్న అనుంగులు
... అయోమయంలో ఈటల..
By: K. Ashok reddy, Sr. Journalist, Hyderabad. Published 13.5.2021, 8.40pm.
ఏ ఆర్ మీడియా/ ఏసియన్ మీడియా
హైదరాబాద్ :
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే నానుడి అక్షరాలా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ కు సంబంధించి ఆయన దగ్గర పనిచేసే వారే సీక్రెట్ విషయాలను సైతం ప్రత్యర్థులకు ఉప్పందించి నట్లు తెలుస్తోంది
ఈటలరాజేందర్ కి సంబంధించిభూముల వ్యవహారం దానికిసంబంధించినపత్రాలు, తదితర అన్ని అంశాలను ఆయన వ్యతిరేకులకు అందించి, విశ్వసనీయంగా పని చేస్తున్నట్లు నటిస్తున్నట్లు సమాచారం. ఎంతో నమ్మకంగా ఉండాల్సిన పిఆర్ఓ, పీ ఏ లు కోవర్టు లు గా మారి ఆయన వ్యాపార లావాదేవీలుఅన్నిటినీ ప్రత్యర్థులకు అందించడంలో సఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఎవరిని నమ్మాలో..? ఎవరిని నమ్మకూడదో..? తెలియని అయోమయంలో పడిపోయారు. భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ఈటల రాజేందర్ కి సంబంధించి వ్యాపార లావాదేవీలు భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రత్యర్థులకు ఉప్పందించి, ఏమీ ఎరుగని అమాయకులుగా, ఆయన చుట్టూనే తిరుగుతూ పొంచి ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఇటీవల కాలంలో ఈటెల రాజేందర్ భూకబ్జాలు అక్రమాలపై పూర్తిస్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి వివరాలు అందజేస్తున్నారు. అయితే ఇలాంటి పూర్తిస్థాయి వివరాలు ఈటల రాజేందర్ ఇంటినుంచే సదరు నేతకు అందినట్లు సమాచారం. కరీంనగర్ వరంగల్, హైదరాబాద్ మెదక్ జిల్లా లో రాజేందర్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ నేత అంత బహిరంగంగా మీడియా ముందు వెల్లడించారని సమాచారం. భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, గ్రామాల వివరాలను ప్రత్యర్థులకు అందిస్తూ ఈటల రాజేందర్ ను నమ్మించి కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్న అనుంగు అనుచరులను ఆయన గుర్తించలేకపోతున్నారు. మెదక్ జిల్లాలోని అసైన్మెంట్ భూముల వ్యవహారం పై, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ భూముల వ్యవహారాలను కాంగ్రెస్ నేతలకు చేర వేసినట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ తన ఇంటి నుంచే లీక్ అయినట్లు, ఆయన కుటుంబ సభ్యులు తాజాగా పసిగట్టినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ దగ్గర పనిచేస్తున్న పిఆర్ఓ పై అవినీతి అక్రమాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే ఈ పిఆర్వో పై అక్రమంగా రూ.10 కోట్ల వరకు సంపాదించారని వదంతులు వచ్చాయి. పలు పత్రికల్లో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పట్లోనే ఈ పి ఆర్ ఓం తొలగిస్తారని అనుకున్నప్పటికీ అనుంగు అనుచరుడిగా మిగిలి ఉన్న కారణంగా ఆయనను చూసి చూడనట్లుగా వదిలేసినట్లు సమాచారం. అయితే ఈ పిఆర్ఓ కి, సీఎం కేసీఆర్ పిఆర్ఓ గటిక విజయ్ కుమార్ అండదండలు ఉండటంవల్ల ఈటల పెద్దగా పట్టించుకోలేదు. 
దీన్ని ఆసరాగా తీసుకున్న విఆర్వో వేల కోట్ల ఆస్తుల సంపాదన లో నిమగ్నమై పోయారు. ఇందులో భాగంగానే ఈటెలకు సంబంధించిన అన్ని వ్యాపార లావాదేవీల రహస్యాలను ప్రత్యర్ధులకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొదటి నుంచి ఈ పిఆర్ఓ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈటల రాజేందర్ అనుచరులు విషయాన్ని చెప్తున్నప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన సదరు పిఆర్ఓ అక్రమ సంపాదనే లక్ష్యంగా తన పనులు చక్క పెట్టుకున్నట్లు హుజరాబాద్ లోని ఈటెల అనుచరులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇకనైనా ఈటల రాజేందర్ కళ్ళు తెరిచి ఇంటి దొంగలను గుర్తించి సాగనంపితే భవిష్యత్ రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో మళ్లీ ప్రత్యర్థులకు అన్ని విషయాలను ఉప్పందించి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి.
మొదటి నుంచి ఉన్న అనుమానాలన్నీ నిజమే
ReplyDeleteYes
ReplyDelete