మోడీ ఏడేళ్ల పాలన పూర్తైన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సేవాకార్య క్రమాలు చేపట్టనున్న రాష్ట్ర బి జె పి శ్రేణులు

 Asian Media Network

Hyderabad may 29

నరేంద్ర మోదీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, మే 30, 2019న రెండోసారి అధికారంలోకి వచ్చి రేపటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది.


కరోనాను దృష్టిలో పెట్టుకుని ఉత్సవంలా కాకుండా లాక్ డౌన్ నిబంధనలకు లోబడి కరోనాను అరికట్టే ప్రయత్నంలో భాగంగానే సేవా కార్యక్రమాలు ఉండాలి.

దేశంలోని ప్రతి డివిజన్ లో కనీసం 10 పోలింగ్ బూత్ లలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి.


గత ఏడాదిన్నర నుంచి కరోనా బారిన పడ్డ ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు, కొవిడ్ ను నిలువరించేందుకు నరేంద్ర మోదీ సర్కారు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంది. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని కాపాడుతూనే ఉంది.


తీవ్రమైన కోవిడ్‌ సంక్షోభంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరుతో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కరోనాను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించే ప్రధాన లక్ష్యంతో ఈ ప్యాకేజీని రూపొందించింది.

కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తిరిగి ఊపిరులూదేలా, మేకిన్‌ ఇండియాకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు నింపేందుకు దోహదపడింది.


ఎన్ని సంక్షోభాలు వచ్చినా ప్రజా సంకల్పంతో మరింత ధైర్యంగా ఎదుర్కొనగలమనే ధీమాను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు అందించగలిగారు. అలాగే స్వదేశీ పరిజ్నానంతో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలనే మహా సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో 20 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. 2021 సంవత్సరం ముగింపు నాటికి 100 కోట్ల మందికి రెండు డోసుల టీకా ఇచ్చే కార్యక్రమం పూర్తిచేసేలా కృషి చేస్తోంది.

కరోనాను ఎదుర్కొనేందుకు తొలిసారి లాక్ డౌన్ లో, రెండోసారి వివిధ రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్ సందర్భాల్లో కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అసమాన సేవలందించారు. అందిస్తూనే ఉన్నారు. 


నిరుపేదలెవ్వరూ ఆకలితో అలమటించకూడదని, వారికి కడుపు నిండా భోజనం పెట్టాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా భోజన వితరణ, నిత్యావసర సరుకుల పంపిణీ చేసి సమాజానికి చేయూతగా నిలిచారు. సాయం అందించారు


. ఇప్పుడు కూడా అదేవిధంగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మీ సేవలు సమాజానికి ఎంతో అవసరం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 10 వేల బూత్ లలో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి.


 

ఆకలితో ఉన్నవారికి భోజన వితరణ, ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, కొవిడ్ బాధిత కుటుంబాలకు మెడికల్ కిట్లు, ఫేస్ మాస్కులు పంపిణీ, సానిటైజేషన్, చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవ్వడం, బలవర్దకమైన ఆహార పదార్థాలు ఇవ్వడం, అవసరమైన వారికి రక్తదానం, ప్లాస్మాదానం చేయడం, చేయించడం, బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా వారికి మార్గనిర్దేశనం చేయడం వంటి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు జరగనున్నాయి. 

30 మే 2021 రోజున జాతీయ నాయకుల నుంచి మొదలు బిజెపి రాష్ట్ర నాయకులంతా ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమై.. ప్రతి నాయకుడు కనీసం రెండు కార్యక్రమాల్లో పాల్గొనాలని బిజెపి కేంద్ర నాయకత్వం ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారితో సహా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్లమెంట్ సభ్యులంతా వారి నియోజకవర్గాల్లో ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వనున్నారు.


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ  కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ఈ సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలి. కరోనాను నియంత్రించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం.



Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్