:మేము పెట్టిన బిక్ష "నమస్తే తెలంగాణ" ... ఆస్తులు అమ్మైనా ఆత్మ గౌరవం కాపాడుకుంటాం


.AR Media Network

By/ K. Ashok reddy, Sr. Journalist, 

Hyderabad. Published: 30.5.2021, 10.30 pm

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈటల రాజేందర్ కుటుంబం కెసిఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతోంది. ఆత్మగౌరవం నినాదంతో తో ముప్పేట దాడి చేయాలని ఈటల రాజేందర్ కుటుంబం గట్టిగా నిర్ణయించుకుంది. ఉన్న ఆస్తులు సైతం అమ్ముకుని కెసిఆర్ కుటుంబం పై తిరుగుబాటు బావుటా ఎగురవేయదానికి  సన్నద్ధమవుతోంది.


ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ ఢిల్లీ స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తుండగా, ఆయన సతీమణి జమున    హచరిస్ గ్రూప్ ఆఫ్  చైర్ పర్సన్ జమునా రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా అతరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసలు కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎలా ఉండేవాడు..?  అసలు ఆయన ఆస్తులు అప్పట్లో ఎంత ఉండేది..? ఇప్పుడు ఎంత ఉన్నాయి ..? అనే విషయాలపై విచారణ చేయాలని జమునా రెడ్డి విలేకర్ల సమావేశంలో ఓపెన్ చాలెంజ్ చేశారు. అలాగే ఈటెల రాజేందర్ ఆస్తులపై ఆగమేఘాలపై విచారణ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమాన్ని తొక్కి పారేస్తూ ఉందని ఆలోచించి మనకంటూ ఒక పత్రిక ఉండాలని నిర్ణయించడం జరిగింది. 

దేవరయాంజల్ లో ఉన్న తమ 6 ఎకరాల భూమి ఈటల రాజేందర్ బ్యాంకు లో పెట్టి డబ్బులు తెచ్చి "నమస్తే తెలంగాణ" కోసం ఇచ్చిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు

మేము నిలబెట్టిన అదే పత్రికలో మాపై అభాండాలు వేస్తూ కథనాలు ప్రచురించడం బాధ కలిగిస్తోందన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం తగదని, ప్రజలంతా దీన్ని ఈసడించుకుంటున్నారు.  2008లో దేవరయంజాల్ లో ఉన్న తమ భూమిలో బేవరేజెస్ కోసం ఒక గోదామును నిర్మించి కిరాయికి ఇచ్చామని జమున వెల్లడించారు. అయితే కక్ష పూరితంగా ఇటీవల దానిని ఖాళీ చేయించాలని, ఈ తతంగమంత  ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు

. ఈ గోదాంకు సంబంధించి టాయిలెట్లు లేవని, లారీ లో ఉన్న సరుకును దొంగలు దోచుకెళ్లారని వీటన్నిటికీ నష్ట పరిహారం రూ.5  లక్షల వరకు చెల్లించాలని  నోటీస్ పై బలవంతంగా  సంతకం తీసుకొని వెళ్లారని వివరించారు. ఇలాంటి అధికార దుర్వినియోగం ఎక్కడా చూడలేదని ఆక్షేపించారు. సుమారు 100 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకున్నారని "నమస్తే తెలంగాణ" లో అబద్ధపు వార్తలు రాసి ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నాలు చేయడాన్ని ప్రజలు నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. నిజంగా  జమున  హెచరీస్ కు సంబంధించి కేవలం 40 ఎకరాలు మాత్రమే తాము కొనుగోలు చేశామని, మిగతా 60 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు

. భూములు అమ్మినా సరే తిరుగుబాటు చేస్తాం. ఈటెల రాజేందర్ వ్యక్తిత్వంపై బురద జళ్లేందుకు చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఈటల జమునా రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆత్మగౌరవం కోసం తనకున్న 40 ఎకరాల ఆస్తులను పూర్తిగా అమ్ముకుని ప్రజల పక్షాన నిలబడతామని వెల్లడించారు. ఆత్మ గౌరవం కోసం ఆస్తులను అమ్ముకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నామని, సామాన్య మానవులుగా జీవించడం తమకు అలవాటేనని ఆమె వెల్లడించారు. కింది స్థాయిలో కష్టపడి బ్రతికే సామర్థ్యం కూడా ఉందని ఆమె నొక్కి చెప్పారు.


 ఢిల్లీలో రాజేందర్ 

తన రాజకీయ భవిష్యత్తుపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు ఈటల రాజేందర్ ఢిల్లీకి పయనమై వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు బిజెపి మాత్రమే సరైన మార్గం గా ఎంచుకుంటారని భావిస్తున్న తరుణంలో,  ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పై ప్రత్యక్ష పోరుకు సిద్ధంగా


ఉంటామని, దీనికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఈటల రాజేందర్ ఢిల్లీ బీజేపీ పెద్దలను కోరినట్లు సమాచారం. బిజెపి లో చేరితే కెసిఆర్ ని ఎదుర్కోవడం సులభతరం అవుతుందని ఈటెల రాజేందర్ కుటుంబం కూడా ఏకీభవించడం తో ఈటల ఢిల్లీ బీజేపీ పెద్దలు కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే వచ్చే జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కెసిఆర్ పాలన తీరు పై సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం
.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్