-ఈ పాస్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి - డీజీపీ మహేందర్ రెడ్డి*,
AsianMedia /AR Mediఆ
By..Badri Srikanth
హైద్రాబాద్ మే24
ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రం లోకి ప్రవేశించే అన్ని వాహనదారులను తప్పనిసరిగా సంబంధిత రాష్ట్రాల అధికారులు జారీ చేసిన ఈ-పాస్ లేదా తత్సమాన పాస్ లుంటేనే అనుమతించడం జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టంవేశారు
. అయితే, ఇతర రాష్ట్రాలనుండి పేషంట్లను తీసుకువచ్చే అంబులెన్సులు, ఇతర వాహనాలను మాత్రం ఏ విధమైన ఆంక్షలు లేకుండా రాష్ట్రంలోకి యధావిధిగా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వాహనాలను ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిపి వేస్తున్నారన్న వార్తలపై డీజీపీ మహేందర్ రెడ్డి నేడు వివరణ ఇచ్చారు.
మెడికల్ ఎమర్జెన్సీ మినహా సంబంధిత రాష్ట్రాలు జారీచేసిన ఈ-పాస్ లను కలిగి ఉన్న అన్ని రకాల వాహనదారులను మాత్రం అనుమతిస్తున్నామని తెలిపారు. దీనితోపాటు, జాతీయ రహదారులపై అన్నిరకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాలను అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు తెలంగాణా రాష్ట్రంలో కోవిద్ నియంత్రణకై లాక్ డౌన్ విధించిన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రించేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపారు.
Comments
Post a Comment