చెత్తను తక్షణం ఎత్తివేయండి... భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటన
Asian Media Network
By..Vijaya dar Reddy
Hyderabad M ay 25
హైదరాబాద్ నగరమేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో పారిశుద్ధ్యం పై ఆకస్మిక తనికీలు ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
ఉదయం 6 గంటలకు మొదలైన మేయర్ పర్యటన osmania ఆసుపత్రి వద్ద 5 రూపాయల బోజనం కౌంటర్ వద్ద చెత్తను చూసి వెంటనే తీసి వేయాలని ఆదేశించారు. అక్కడ కౌంటర్ హాస్పిటల్ కు ఇబ్బందిగా ఉండడం గమనించిన మేయర్ అక్కడ అన్నపూర్ణ కాంటీన్ కౌంటర్ ను వెంటనే షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ లోపల ఫస్ట్ అండ్ మెడికల్ ఆఫీసర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ లతో కలసి సందర్శించిన లోపల బాగం చాలా చోట్ల పారిశుద్ధ్య లోపాలను గమనించిన మేయర్ సిబ్బంది ని పిలిచి మొత్తం క్లియర్ చేయాలని ఆదేశించారు . మెడికల్ వేస్ట్ కింద పడడం గమనించిన మేయర్ ఇలాంటి సంగటనలు మళ్ళీ జరగకుండా చూసకుకోవాలని ఆదేశించారు
. అక్కడ ఉన్న పేషెంట్ లతో మాట్లాడిన మేయర్ కరొన positive వచ్చిన పేషెంట్ లను గాంధీ కి వెంటనే షిఫ్ట్ అయ్యే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . వార్డు లో మరియు ఆపరేషన్ థియేటర్ మరియు మార్చురీ సమస్యలను మేయర్ దృష్టికి రాగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని తెలిపారు . అక్కడ సిబ్బంది చేతులకు గ్లౌస్ లు లేకుండా పని చేయడం ఒకరు మాస్క్ వేసుకోక పోవడం చూసి న మేయర్ పారిశుద్ధ్య సిబ్బంది గ్లౌస్ లు కచ్చితంగా వేసుకోవాలని మేయర్ తానే స్వయం కొన్ని గ్లౌస్ లు మాస్కులు అందచేసారు .
జియగూడ రోడ్డు లో మూసి పక్కన పేరుకుపోయిన చెత్తను చూసిన మేయర్ వెంటనే తొలగించాలని ఆదేశించారు . ఎదురుగా చార్మినార్ జోన్ లో కోడా శ్మశాన వాటిక వద్ద ఉన్న చెత్తను కూడా తొలగించాలని మేయర్ ఆదేశించారు . లంగర్ హౌస్ , గోల్కొండ , ఏరియా లలో పారిశుద్ధ్యం పై తనికీలు చేసన మేయర్ అక్కడ కొన్ని ప్రదేశాలలో చెత్తను చూసి తొలగించాలని ఆదేశించారు . జియగూడ లో ctp ప్లాంట్ వద్ద చెత్తను డంప్ చేయడం చూసిన మేయర్ ఆటో ల చెత్త తో పాటు ఆ చెత్తను కూడా ctp ప్లాంట్ ద్వారానే చేయాలని ఎందుకు జవహర్ నగర్ పంపుతున్నారని మేయర్ అనగా 7 రోజుల్లో చెత్త ను లేకుండా ctp ద్వారానే చెరవేస్తామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు .
ట్విటర్ లో మోతి దర్వాజ దగ్గర చెత్త పేరుకుపోయిన కంప్లయింట్ చూసి అక్కడకు వెళ్ళిన మేయర్ మోతి దర్వాజ దగ్గర నాలలో చెత్తను చూసి వెంటనే తొలగించాలని ఆదేశించి అలాగే అక్కడ కూలిన గోడను వెంటనే నిర్మించే విదంగా చర్యలు తీస్కొని అలాగే పురాతన కట్టడాలను కాపాడటం తో పాటు ఆక్రమణలకు గురి కాకుండా చూస్తామని తెలిపారు. నగరం లో పారిశుద్ధ్య పనులు బాగా జరుగుతున్నాయి ప్రజలు కూడా తమ వంతు గా చెత్త ను దయ చేసి ఓపెన్ పాయింట్ లలో వేయకుండా ఆటో లకు మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు . అలాగే నిన్నటి వరకు రెండో విడతలో 1522 టీం లతో 3,42,479 ఇల్లలో ఫీవర్ సర్వే నిరహించడం జరిగిందని అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా నిన్న 66,610 మందికి బోజనం పంపిణీ చేయడం జరిగింది అని మేయర్ తెలిపారు
.
Ghmc కంట్రోల్ రూమ్ లో ఆకస్మిక తనికి నిర్వహించిన మేయర్ అక్కడ వచ్చే కాల్స్ గురించి తెలుసకున్నారు నిన్న ఒక్కరోజు లో 61 ఫోన్ కాల్స్ ద్వారా 6 గురు ఆయుష్ డాక్టర్ లు 19 మందికి మెడికల్ సపోర్ట్ ఇచ్చారు అలాగే 15 మందికి కిట్ లు పంపండం జరిగిందని vaccination గురించి 21 మంది ఫోన్ కాల్స్ వచ్చాయని కంట్రోల్ రూమ్ వారు మేయర్ కి తెలియచేసారు . నగరం లో నేటి నుండి 2 వ డోసు vaccination పంపిణీ జరుతుందని అలాగే బెడ్ లు కావాలని ఎవరు కాల్ చేసిన నెంబర్ ఇవ్వడం కాకుండా వారికి బెడ్ ఇప్పించే విధంగా కంట్రోల్ రూమ్ వారు చూడాలని మేయర్ ఆదేశించారు .
Comments
Post a Comment