నాణ్యత లోపించిందని డ్రైనేజ్ లైను వెంటనే నాణ్యతతో పునరుద్ధరణ చేయాలని అధికారులను ఆదేశించిన కార్పొరేటర్
Asian Media Network
By A.Vijayender Reddy Correspondent
Hyderabad May 26,
రామంతపూర్ బగాయత్ సాయి క్రిష్ణ కాలనీ లో (UGD) అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతుండడంతో అక్కడి కాంట్రాక్టరు నాణ్యతపాటించకపోవడంతో కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన
కార్పొరేటర్ వెంటనే అక్కడికి వెళ్లి జలమండలి అధికారు లను డీజి ఎం శ్రీధర్ రెడ్డి, మేనేజర్ సాయిబాబాను పిలిచి వారితో పర్యటించి అక్కడ నడుస్తున్న పనులను పర్యవేక్షించారు. డ్రైనేజీ పైపుుల నిర్మాణంలో నాణ్యతా లోపం లేకుండాా చూడాలని అధికారులకు చెప్పారు ఇప్పటివరకు జరిగిన పని నాణ్యత ను పరిశీలించి నాణ్య్యతా లోపం ఉన్నట్లయితే పునరుద్ధరణ చేయాలని కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు అధికారుల ను ఆదేశించారు.
దానిలో భాగంగా సాయి క్రిష్ణ కాలనీ వాసులు పరశురాం, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీకాంత్, జలీల్, ప్రతాప్, చారి, శ్రీను, మహేష్, నరసింహ, మిశ్రా, సాయిబాబా, బాలకృష్ణ, రాజు చారి తో పాటు
బిజెపి నాయకులు రామంతపూర్ డివిజన్ బిజెపి ప్రెసిడెంట్ బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, తిరుపతయ్య, నిశాంత్ పాల్గొన్నారు
Comments
Post a Comment