ఈటెల రాజేందర్ తో ప్రొఫెసర్ కోదండరాం మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ

Asian Media Network 

Mohon Bairaagi

Hyderabad May27

ఈటలరాజేందర్ నివాసంలో ఈటల రాజేందర్ తో సమావేశం అయిన ప్రాఫెసోర్ కోదండరాం,  కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 


సమావేశం తరువాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 
రాజకీయ కక్ష తో ఈటల మీద చర్యలు తీసుకున్నారు. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము.
రాజకీయాలు చర్చించలేదు. కెసిఆర్ కు దమ్ముంటే ఎందుకు ఈటెల ను పార్టీ నుండి ఎక్స్పెల్ చెయ్యలేదు. 
అయినా రాజకీయాలకు ఇది సమయం కాదు.
కరోనా నివారణకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కోవిద్ తో కొట్లడడం అందరి ముందు చేయాల్సిన పని. కెసిఆర్ ఈ రాజకీయాలు పక్కన పెట్టీ ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. 
ఐక్య వేదిక కోసం ప్రయత్నం చేస్తున్నాం. 
ప్రో. కోదండరాం మాట్లాడుతూ.. 
విచిత్రమైన విషయం రాజకీయ పరిస్థితి తెలంగాణ లో ఉంది. రాజకీయ  విభేదాలు ఉంటే చర్చించాలి తప్ప కక్ష సాధించడం ఎంటి? 
కెసిఆర్ దగ్గర పని చేసే వారు ఎవరైనా తన నీడలో బ్రతకాలి అనుకుంటాడు. వ్యక్తిగతంగా ఎదిగితే ఒప్పుకోడు. 
విపరీతమైన  విద్వేషం చూపిస్తాడు.  
రాజకీయంగా,  ఆర్థికపరంగా ఒత్తిడి తీసుకువచ్చి ఇబ్బంది పెడతారు.  
వైద్య దొరకక ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా, రాజకీయాలు చేయడం ఎంటి? 
జూడ సమస్య పరిష్కారం చెయ్యరు. 
కొవిద్ మీద ప్రతి పక్షాలు అన్నీ కలిసి పని చేయాలి. 
రాజకీయ కక్ష ను ఎదుర్కోవాలి. 
ఏకొన్ముఖ్చం గా పోరాటం చేస్తాము.  
ధాన్యం కొనుగోలు లేదు దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. 
దాడులు ఆపాలి అని కెసిఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 
కుటుంబ సభ్యులను కూడా ఇరికించి బాధ పెడుతున్నారు. 
రాజకీయం అంటే పార్టీ కాదు సమస్యల మీద కూడా చర్చించడం కూడా. 
ఈటల మీద దాడిని ఆత్మ గౌరవం మీద దాడి గానే చూస్తున్నాం. తెలంగాణ లో అందరం కలిసి పొట్లడతం.అందరం కలిసి పని చేస్తాం అది ఏ రూపు తీసుకుంటుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

Comments

Popular posts from this blog

విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!

యండమూరి వీరేంద్రనాథ్ తాజా చిత్రం"అతడు-ఆమె-ప్రియుడు"

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు