**బాలల రక్షణ సంరక్షణ ధ్యేయం* - సీ డబ్ల్యూ సీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు
Asian Media Network
వరంగల్ అర్బన్ 29.05.2021
కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో బాలల రక్షణ సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు అన్నారు, శనివారం రోజున సుబేదారి లోని బాల రక్షా భవన్ లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో కోవిడ్ బారిన పడి మరణించగా అనాధలైన పిల్లలకు కల్పించే పునరావాస చర్యలు పై సమీక్ష సమవేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి వివరిస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో ఇటీవలి కాలంలో కరోనా పాజిటివ్ వచ్చి తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లల కోసం, గతంలో తల్లి కానీ తండ్రి కానీ ఏదేని కారణం చేత చనిపోయినా, లేదా కరోనా బారిన పడి చనిపోయినా తల్లి లేదా తండ్రి, ఇప్పుడున్న పరస్థితుల్లో ఎవరు లేక నిరాశ్రయులైన పిల్లలకు తక్షణ పునరావాసం కల్పించుటకుగాను 040-23733665 నంబర్ కు ఫోన్ చేయాలని,
ఆపదలో ఉన్న బాల బాలికలు తక్షణ పునరావాసం రక్షణ సంరక్షణ కోసం 24 గంటలు పనిచేసే ఉచిత సహాయవాణి చైల్డ్ లైన్ 1098 నంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. స్థానిక అంగాన్ వాడి టీచర్ కు సమాచారం అందించాలని తెలిపారు,
రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గారి సూచన మేరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తగు చర్యలు చేపడుతుందని, బాల బాలిక జీవితాలకు భరోసా కల్పించే దిశలో చర్యలు తీసుకుంటామని అన్నారు,
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్, కాజంపురం దామోదర్, పి హైమావతి, ఐసిపిఎస్ డీ సి పి ఓ పి సంతోష్ కుమార్ ,ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎం మౌనిక, ఏ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment