సుప్రీం కోర్టు ఆదేశాలతో 21 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు!*

 * ఏషియన్ మీడియా నెట్వర్క్ 
న్యూఢిల్లీ జూన్ 21


రోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. పరీక్షలు జరగాల్సిన మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. దీంతో చాలా రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకు వెనకడుగు వేశాయి. 10, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించాయి.


అయితే దేశంలో నాలుగు రాష్ట్రాలు 10, ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టు జూన్ 17వ తేదీన పరీక్షలు రద్దు చేయని పంజాబ్, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులుజారీచేసింది.ఇకఈవ్యవహారంపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. 

12వ తరగతి పరీక్షల విషయంలో 28 రాష్ట్రాల్లో, 18 రాష్ట్రాలు రద్దు చేశాయి.6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించగా, 4 రాష్ట్రాలు రద్దు చేయలేదు. కేరళ 11 తరగతి పరీక్షలు రద్దు చేయకపోవడంతో ఆ రాష్ట్రానికి కూడా సుప్రీంకోర్టునోటీసులు పంపింది.ఇక పరీక్షల అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. *అయితే తాజాగా అస్సాం, పంజాబ్‌, త్రిపుర రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేస్తామని తెలిపాయి.

ఇక మిగిలింది ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే, రేపటి విచారణలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేరుగా కోర్టుకు తెలిపే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్