జూలై 4న ప్రారంభం కానున్న బాలానగర్ ఫ్లైఓవర్
ఏషియన్ మీడియా నెట్వర్క్
చంద్రమోహన్
హైదరాబాద్ కూకట్ పల్లి జూన్ 19,
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బాలానగర్ ఫ్లైఓవర్ జూలై 4 వ తేదీన ...మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన అనంతరం విలేకరులకు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు ఉన్నా ఏ ప్రభుత్వాలు కానీ, ఏనాయకులుకానీపట్టించుకోలేదని.... ఈ ఫ్లై ఓవర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కృషితో.. ఈనాడు పూర్తి చేసుకున్నామని ఆయన చెప్పారు
కేవలం హైదరాబాద్ మహానగరం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని.. ప్రతిపక్షాలు ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని విమర్శలు మాని అభివృద్ధి గురించి మాట్లాడాలని.. కూకట్పల్లి నియోజకవర్గం లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణంలు పూర్తి చేసుకున్నామని ఇక ముందు కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా మని అన్నారు...
అలాగే త్వరలో నర్సాపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమగును అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రజలకు చేరవేస్తామని అన్నారు.. అలాగే బాలనగర్ , ఫతే నగర్ డివిజన్ ప్రజలు కలుషిత నీరు కలవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మనసుతో దాదాపు 300 కోట్లతో పనులు ప్రారంభించడానికి నిధులు మంజూరు చేయడం శుభపరిణామమని అన్నారు..
Comments
Post a Comment