ఈ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు బెంబేలెత్తిపోతున్నసామాన్య ప్రజలు

 ఏషియన్ మీడియా నెట్వర్క్ 

హైదరాబాద్ జూన్ 18

 

దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపు . 

శుక్రవారం మరోసారి ధరలు పెంచిన చమురు కంపెనీలు

 ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయికి పెట్రోలియం ధరలు ...లీటర్  105 రూపాయలు. 


కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.93, డీజిల్‌ రూ.87.69కు పెరిగింది. మరో వైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్‌ రూ.105 మార్క్‌ను దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ ధర రూ.103కి చేరింది. 
మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.108.07 డీజిల్‌ రూ.100.82కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా.. దేశంలో చమురు కంపెనీలు ధరలను పెంచాయి. 


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ధరలు పెరగ్గా.. పెట్రోల్‌పై రూ.6.61, డీజిల్‌ రూ.6.91 పెరిగింది. ఫిబ్రవరి 26న ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా.. చివరిసారిగా ఫిబ్రవరి 27న ధరలు పెరగ్గా.. ఆ తర్వాత ధరలు పెరుగలేదు. గురువారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి.. 
బ్రెంట్ ముడి బ్యారెల్‌కు 1.31 డాలర్లు తగ్గి 73.08 డాలర్లకు పడిపోయింది. యూఎస్‌ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 1.11 డాలర్లు తగ్గి.. బ్యారెల్‌ 71.04 వద్ద ట్రేడవుతోంది.


*దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 87.41గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82కు పెరిగింది. లీటర్ డీజిల్
ధర రూ.94.84గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.58 ఉండగా.. డీజిల్ ధర రూ. 90.25గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.91గా ఉంది. డీజిల్ ధర రూ.92.04గా
ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.89 పలకగా.. డీజిల్ ధర రూ.92.66గా ఉంది. ఇప్పటివరకూ జూన్ నెలలో ఇందన ధరలు తొమ్మిది సార్లు పెరిగాయి. మే నెలలో 16 సార్లు పెరిగాయి. మే 4 నుంచి ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్, కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ.100 మార్క్ దాటేశాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 95.28గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 102.98 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.47లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.27గా ఉంటే.. డీజిల్ ధర రూ.96.47గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.94గా ఉంటే.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది.




Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్