తప్పుచేసాను..! ... క్షమించండి.. !! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈటెల లేఖ
తప్పుచేసాను..!
... క్షమించండి.. !!
.. సీఎంకు ఈటల లేఖ..!
.. ఎన్నికల వేళ లేఖ బహిర్గతం పై దుమారం
ఉత్తరం పై ఈటెల సీరియస్..... .వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
By: K. Ashok Reddy
Sr. Journalist, hyderabad
ఏఆర్ మీడియా/ ఏషియన్ మీడియా
హైదరాబాద్: జూన్25
హుజారాబాద్ ఉప ఉన్నికల వేళ ఈటెల రాజేందర్ సీఎంకు రాసినట్లుగా లీక్ అయిన ఒక లేఖ సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్ కు రాసినట్లు ఉన్న లేఖలో తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు. ఆ తప్పులను సరి చేసుకునేందుకు ఒక అవకాశం కోరారు. చేసిన తప్పులకు సీఎం ను క్షమాపణ కోరారు
…బెంగుళూరు,పూణే లో ఇతర చోట్లలో నేను పెట్టిన సమావేశాలు కొందరి తప్పుడు మాటలతో పెట్టాల్సి వచ్చింది.. అలా సమావేశాలు పెట్టి పార్టీకి ఇబ్బంది కలిగించేలా కొన్ని పనులు చేయడం ముమ్మాటికీ తప్పే. అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు
పెద్ద మనసుతో మన్నించు :
నన్ను మరోసారి పెద్ద మనసుతో మీ తమ్ముడిగా భావించి పెద్ద మనసుతో క్షమిస్తారని.. ఇక నుండి అలాంటి తప్పులను కానీ.. పార్టీకీ ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేయనని మాటిస్తున్నట్లు ఆ లేఖలో ఉంది…నేను పెట్టిన సమావేశాల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు కానీ,ఇతర జిల్లాల నాయకులను పార్టీకి విధేయంగా పని చేసేలా చూస్తాను.. పదవులలో సంబంధం లేకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనుక్షణం సిద్దంగాఉంటానని పేర్కొన్నారు.
రామ్ తో అన్ని చెప్పా:
ఇదే విషయాన్ని నేను రామ్ తో అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పానని.. ఆనాడు చెప్పిన దానికి ముమ్మాటికీ కట్టుబడి ఉంటానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు
ఆ లేఖలో..నిన్నటి నుండి జరిగిన పరిణామాలు..నాపై కొన్ని ఛానళ్ల లో వార్తలు రావడం నన్ను తీవ్రంగా కలచివేశాయి.. నేను చేసిన పనులు కొన్ని తప్పే కావచ్చు.. కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించారని లేఖ లో ఉంది.
లేఖ అసలుదా..? నకిలిదా...?
అయితే ఈ లేఖ అసలైందో కాదో తెలియని పరిస్థితి. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ మీడియాలో ఆ లేఖ చక్కర్లు కొడుతోంది. అయితే ఈటెల రాజేందర్ నోరు విప్పితే కానీ ఆ లేఖ నిజమా…సృష్టా తేలుతుంది…బీజేపీలో చేరి హుజురాబాద్ ఎన్నికల్లో తల మునకైన వేల ఇలాంటి లేఖ బయటకు రావడం కల కలం సృష్టించింది…
లేఖపై ఫిర్యాదు:
తాను సీఎంకు రాసినట్లు గా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న లేఖపై ఈటల వీణవంక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. తను ఈ లేఖ రాయలేదని, దీనిపై సమగ్ర విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
Comments
Post a Comment