కరోనా నిబంధనలు సీఎంకు వర్తించవా..?
...వాసాలమర్రి లో 3000 మందికి సహపంక్తి భోజనాలట...
.... సీఎం కేసీఆర్ భోజనాలు పెడతారట..
..జాతి మతం భేదం లేకుండా అందరూ రావాలట...
...అన్ని ఏర్పాట్లకు అధికారులకు ఆదేశం
By: K. Ashok reddy
Sr. Journalist,
ఏ ఆర్ మీడియా/ ఏషియన్ మీడియా
హైదరాబాద్ జూన్ 19
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సహపంక్తి భోజనాలు నిర్వహిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది . నియమ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమంత్రి తానే ఆ నియమాలను ఉల్లంఘించే నిర్ణయాలు తీసుకోవటం విస్మయానికి గురిచేస్తుంది
. యాదాద్రి జిల్లా వాసాలమర్రి లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22న ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కుల, జాతి, మత బేధాలు లేకుండా అందరితో కలిసి భోజనం కూడా చేస్తారట... గ్రామంలో ఉన్న 2600 జనాభాతో పాటు చుట్టుపక్కల ఉన్న వారంతా కలుపుకొని దాదాపు 3000 మంది వరకు సహపంక్తి భోజనాలకు అధికార యంత్రాంగం నిమగ్నమై పనిచేస్తోంది.
నాకు కూడా కరోనా వచ్చింది : సీఎం కేసీఆర్
ఎప్పటి నుంచో వాసాలమర్రి సందర్శించాలని అనుకుంటున్నప్పటికీ, ఈ కరోనా రోగం పాడుగాను, నాకు కూడా వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తనకే కాదు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వల్ల ఆలస్యం జరిగిందని అన్నారు. వాసాలమర్రి లో సహపంక్తి భోజనాలకు అందర్నీ పిలువాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ గ్రామ సర్పంచ్ అంజయ్యను ఆదేశించారు.
భోజనాలకు సంబంధించి పెద్ద పెద్ద షామియానాలు వేసి అందరూ కూర్చుని తినేలా ఏర్పాటు చేస్తారని, ఇందుకు సంబంధించిన స్థలాన్ని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. అలాగే పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నామని దీనికి ఊరు ప్రజలందరినీ తీసుకురావాల్సిందిగా పురమాయించారు. ఈ పని చేస్తే పది కాలాల పాటు సర్పంచ్ గా ఉంటావాని కూడా సీఎం దీవించారు.
సీఎం కు ఏమైనా మానవతీత శక్తులు ఉన్నాయా...?
సీఎం ఏమైనా అతీతులు కాదు. ఆయన కు కూడా కరోన వచ్చింది. ఎవరు పులిరాజలు కారు. ఆ విషయానికి వస్తే పులులకు కూడా కరోన వచ్చింది. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి. కానీ
ఇలా వేల సంఖ్యలో ఒకే చోట సహపంక్తి భోజనాలు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం వల్ల పొంచిఉన్న కరోనా మహమ్మారి పంజా విప్పి కభలిస్తే దానికి ఎవరు బాధ్యులు..?
మళ్లీ కరోనా కేసులు విజృంభించి ప్రాణాలను బలిగొంటే ఆ నష్టాన్ని భరించేది ఎవరు..? ఇలాంటి అనలే అనాలోచిత కార్యక్రమాలు చేపట్టడం వల్ల భారీ నష్టం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు పరిస్థితి అరణ్య రోదనగా మారింది. ఈ రోగం బారిన పడి బయటపడ్డ వారు ప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడీల వల్ల ఉన్న ఆస్తులను కాస్త అమ్ముకొని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు.
ఇప్పుడిప్పుడే కాస్తంత కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మళ్లీ సామూహిక భోజనాలు, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంఎంత వరకు సమంజసం
రాజే నిబంధనలు వదిలేస్తే ప్రజలు వంద రేట్లు వదిలేస్తారు కేంద్ర ప్రభత్వం జూన్ 30 వ తేదీ వరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్ని రాష్ట్ర సర్కారు ల కు చాలా స్పష్టమైన మార్గ దర్శకాలను జారీ చేసింది రాష్టం లో కరోన కేసు లు కొంత తగ్గు ముఖం పట్టిన ఇంకా వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు ఎంతో కొంత మంది చని పోతూనే ఉన్నారు
. ఇప్పటివరకు టీకా వేసుకున్న వారి సంఖ్య కోటి లోపే ఇంకా వ్యాక్సిన్ వేయించుకొని వారు 3 కోట్ల మంది పైగానే ఉన్నారు వారందరికీ వ్యాక్సిన్ ఇస్తే తప్పా కరోనా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు.
మరి ఇటువంటి విపత్కరపరిస్తుల్లోసభలు,సమావేశాలు, సహపంక్తి భోజనాలు పెడితే ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి అవకాశం ఉంటుంది భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరిస్తేనేకోవిడ్మహమ్మారినుండిరక్షించుకోవచ్చు అని పదే పదే వైద్య నిపుణులు చెబుతున్నారు వైద్యరంగ నిపుణుల సూచనల మేరకే ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూసేందుకే లాక్ డౌన్ నైట్ కర్ఫ్యూ వంటివి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి
ఇప్పటికీ మాస్కు ధరించకపోతే ప్రభుత్వ అధికారులు ఫైన్ లు విధిస్తున్నారు వ్యాధి తీవ్రత తగ్గక ముందే ఇటువంటి సమావేశాలు సభలు సహపంక్తి భోజనాలు నిర్వహిస్తే కరోనా వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .
Comments
Post a Comment