ఏషియన్ మీడియా నెట్వర్క్
న్యూఢిల్లీ: జూన్ 18
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీలో బిజీ బిజీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలుసుకున్న స్టాలిన్
. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి మొదటిసారిగా ఢిల్లీ వచ్చారు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి తో పాటు పలువురు అధికార అనధికార ప్రముఖులు కలుసుకున్నారు శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెను కలుసుకున్నారు ఆమెతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీని కలుసుకొని లు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది ముఖ్యంగా గా దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై క్షుణ్ణంగా చర్చించారు అదేవధంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోన వల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల పై చర్చించినట్ల తెలిసింది
2024 నాటికి బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఏ విధంగా అడుగులు వేయాలని దానిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం
ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో ప్రత్యేక సమావేశంలో జరిగినట్లు స్టాలిన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి .
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు సోనియా గాంధీ స్టాలిన్ ను అభినందించారు జనరంజకమైన పాలనను అందించాలని ఆమె కోరారు కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడంలో ఏమాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని మీకు మా మద్దతు ఉంటుందని సోనియా గాంధీ అన్నట్టు తెలిసింది ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి స్టాలిన్. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Post a Comment