ట్రబుల్ షూటర్ వలలో ఈటెల అనుచరులు

 టిఆర్ఎస్ లోకి సమ్మిరెడ్డి
 .

మరో 20 మందికి   తాయిలాలు 


.రంగంలోకి ట్రబుల్ షూటర్ 

దుబ్బాక ఫెయిల్యూర్ ని హుజరాబాద్ లో రాబట్టేందుకు యత్నం

 ...  ...మామ మెప్పు కోసం తాపత్రయం

By: K. Ashok Reddy,
Senior Journalist. Hyderabad. 
ఏ ఆర్ మీడియా /ఏసియన్ మీడియా 

హైదరాబాద్:  జూన్ 20,


 హుజూరాబాద్ నియోజకవర్గం లో బేరసారాలకు తెర లేచింది. ఈటల అనుచరులపై ప్రత్యేక దృష్టి సారించి, వారందరినీ, టిఆర్ఎస్ లో  చేర్చేందుకు రంగం సిద్ధమైంది. 

ఇప్పటికే ఈటల కు ప్రధాన అనుచరుడిగా ఉన్న జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కి గాలం  వేశారు. సమ్మిరెడ్డి  తో పాటు మరో 20 మంది ఈటల ప్రధాన అనుచరులకు ట్రబుల్ షూటర్ నుంచి వర్తమానం అందినట్లు సమాచారం. వీరు కూడా త్వరలోనే ఈటలను విడిచి టిఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకుగాను సదరు నేతలకు రాజకీయ భవిష్యత్తు తో పాటు, ఆర్థిక పరిపుష్టి ఉంటుందని భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మంత్రి హరీష్ రావు హుజరాబాద్ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

ఇందులో భాగంగానే హుజరాబాద్ లో ఈటల వర్గాన్ని తమ వైపు తిప్పుకొని, ఆయనను ఒంటరి చేయాలనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. అయితే దుబ్బాకలో తగిలిన ఎదురుదెబ్బ ను దృష్టిలో పెట్టుకొని మంత్రి హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గంలో పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. దుబ్బాక లో పోయిన పరువును హుజరాబాద్ లో నిలబెట్టుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా హుజరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ జెండాను ఎగురవేసి  "మామ" మెప్పును పొందేందుకు విశ్వ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు.

 బిజెపిలో  ఆసంతృప్తి :


 ఈటల రాజేందర్  బి జె పి కండువా కప్పుకున్న అప్పటినుంచి పాత బిజెపికి, ఈటెల వర్గానికి పొసగడం లేదు. దీంతో ఇరువర్గాలు ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్న యి. కొత్తతరం నేతలు అంతా తామేనని, ఆర్భాటం చేయడంతో పాత బిజెపి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత పాత, కొత్త నేతల తో సమావేశాలు నిర్వహించి సమన్వయం చేయాల్సి ఉంది. అయితే,  ఈ దిశగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం వల్ల విభేదాలు రోజురోజుకు తారస్థాయికి చేరుతున్నాయి.
మా పరిస్థితి ఏంటి..?
 ఇప్పటి వరకు మంత్రి పదవి అనుభవించి, తీరా, బర్తరఫ్ కు  గురైన ఈటెల రాజేందర్ కు బిజెపిలో పదవులు వస్తాయి గాని, మా పరిస్థితి ఏంటని ఈటల అనుచరులు చర్చించుకుంటున్నారు.

సమీప భవిష్యత్తులో జరిగే ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకు పదవి వస్తుంది. కానీ, ఆయనతో ఉంటే మా పరిస్థితి ఏంటి..?  మాకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది..? అనే దానిపై క్లారిటీ లేకుండా ఉండటం మంచిది కాదు అనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీనినే టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఉప్పందించడం వల్ల ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగి అసంతృప్తి వాదులు అందర్నీ పిలిపించి వారికి సముచితంగా న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. ట్రబుల్ షూటర్ వ్యూహం గనుక అమలైతే ఈటల రాజేందర్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్