ఆంధ్రాలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి జగన్

 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్‌

ఏషియన్ మీడియా నెట్వర్క్ 

అమరావతి జూన్ 18

: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,143ఉద్యోగాలనుభర్తీచేయనున్నామని ఏపీ సీఎం జగన్‌ వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం విడుదల చేశారు. మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు, సిఫార్సులు, పైరవీలకు తావు లేకుండా కేవలం మెరిట్‌ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని చెప్పారు.


 

‘ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్లు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం. రెండేళ్లలో ఏకంగా 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం. వీటిలో 1,84,264 శాశ్వత ప్రాతిపదికన, 3,99,791 పొరుగు సేవలు, 19,701 ఒప్పంద ఉద్యోగాలు ఇచ్చాం. రూ.3,500 కోట్ల భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇచ్చాం. ఇప్పటికే ఉద్యోగులకు వేతనాలు పెంచాం. రాష్ట్రానికి ఆదాయం తగ్గిన ప్రతికూల పరిస్థితుల్లోనూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఆపలేదు. రైతులు, మహిళలు, వృద్ధులు, ప్రతి సామాజిక వర్గానికీ న్యాయం చేస్తూ దేవుడి దయతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం సాగుతోంది’’ అని జగన్‌ అన్నారు.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్