చాణక్య నీతి తో పార్టీ సీనియర్లను గాడిన పెడుతున్న రేవంత్ రెడ్డి

 "చాణక్యం' తో రేవంత్
... కూడగడుతున్న సీనియర్ల మద్దతు

... అందరూ కలిసి రావాలని పిలుపు 
.. అంతా సద్దుమణిగాక బాధ్యతలు
.. 7న, ముహూర్తం ఖరారు 
..15 రోజుల్లో పాదయాత్ర 
  


By : K. Ashok Reddy,
Sr. Journalist, 
June 28
 ఏఆర్ మీడియా /ఏషియన్ మీడియా హైదరాబాద్ :


రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సారధి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మరో పదిహేను రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాలను చేపట్టేందుకు కూడా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం

. రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక ముందుగా రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతల అందర్నీ స్వయంగా కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు తదితరులు కలిసి మద్దతు కూడగడుతున్నారు. పార్టీలోని సీనియర్లంతా  కలసికట్టుగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కలిసి రావాలని కోరారు. పిసిసి సారథిగా ఎంపికైన  నేపథ్యంలో, కొంత, పార్టీలో అసంతృప్తులు చెలరేగడం వల్ల వాటిని తనదైన శైలిలో పరిస్కరించ్చేందుకు రేవంత్ ప్రయత్నాలను  చేస్తున్నారు. పార్టీలో అంతా సద్దుమణిగాక, వచ్చే నెల 7న పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. ఆరోజు గాంధీభవన్ లో ఆర్భాటంగా బాధ్యతలు చేపట్టి అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై సమర శంఖాన్ని పూరించనున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 15 రోజుల లోపు తెలంగాణలో పాదయాత్ర కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు చేరువ కావాలని రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి  తీసుకోబోయే నిర్ణయాలతో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు, ప్రజా పక్షాన నిలిచి వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండున్నర ఏళ్లలో నిత్యం ప్రజాబాహుళ్యంలో ఉంటూ, వారికి చేరువయ్యే ప్రణాళికతో ముందుకు సాగనుంది.

 2023 లో అధికారమే లక్ష్యంగా ...

వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగనున్నారు.  ఇందులో భాగంగా పార్టీని గ్రామస్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు పటిష్ఠంగా నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యాన్ని నింపేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ పెడుతున్న అక్రమ కేసులకు నిరసనగా జైలు భరో కార్యక్రమాలు చేపట్టి ప్రజల పక్షాన నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అనేక ప్రజా భాగస్వామ్యం కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడిగా పార్టీ అధిష్టానం భావించి పిసిసి పగ్గాలను అప్పగించింది. దీనిని అమలులో పెట్టి, అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టాలని రేవంత్ రెడ్డి కసితో అడుగులు ముందుకు వేస్తారని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్