ఆదిలాబాద్ జిల్లాలో తగ్గు ముఖం పట్టిన కరోన..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఏషియన్ మీడియా నెట్వర్క్ 
ఆదిలాబాద్ జూన్ 11

 వరి ధాన్యం కొనుగోలు  గడువులోగా పూర్తి చేసినందుకు  అధికారులను  అభినందించిన మంత్రి అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి.

శనివారం  జిల్లా పాలనాధికారి  సమావేశ మందిరంలో  ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో   మంత్రి మాట్లాడుతూ    అందరి సహకారం తో  వరి ధాన్యం కొనుగోలు పూర్తి  చేశామని  సంతోషం  వ్యక్తం చేశారు. కొవిడ్  నియంత్రణ లో భాగంగా  పటిష్టమైన చర్యలు  చేపట్టి   విజయం సాధించామని అన్నారు.పాజిటీవ్ కేసులు తగ్గుముఖం  పట్టాయని  కేవలం  5 పాజిటీవ్ కేసులు  ఉన్నాయని చెప్పారు. 


 
బ్లాక్  ఫంగస్ జిల్లాలో  మొత్తం  14 నమోదు కాగా  అందులో  4గురు  చనిపొయరని  10 మంది  రికవరి  అయ్యారని,  ప్రతి రోజు  ఆసుపత్రికీ  వచ్చే  రోగులు   వ్యాక్షిన్  వేసుకోక పొతే   టీకాలు  ఇవ్వాలని తెలిపారు.
తెలంగాణ  ప్రభుత్వం  నూతనంగా   చేపట్టిన  డిజిటల్ భూ సర్వే  లో భాగంగా  నిర్మల్  జిల్లాకు  సంభందించి   సోన్ మండల్  పాక్ పట్ల  గ్రామాన్ని  ఎంపిక చేసి ప్రతి పాదనలు  ప్రభుత్వానికి  పంపడం జరిగిందని  పేర్కొన్నారు.ఇంటిగ్రెటెడ్  డిస్టిక్  ఆఫీస్  కాంప్లెక్సు  35శాతం  పూర్తి  చేయడం జరిగిందని ఈ పనులు మందకొడిగా   సాగుతున్నాయని  త్వరితగతిన పూర్తి చేయాలనీ  సంబందిత అధికారిని  ఆదేశించారు. 

డబుల్ బెడ్ రూం ఇళ్ల ను త్వరగా పూర్తి చేయాలనీ  సెప్టెంబర్ నెల లో లబ్దిదారుల ఇళ్ల ల్లోకి  వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు
.రైతు బందు. రేషన్ కార్డు లు, తదితర  వాటిపై  చర్చించారు.ఈ సమావేశం లో   జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారూఖీ, ఇన్ఛార్జి  ఎస్పి   ప్రవీణ్ కుమార్, జడ్పీఛైర్ పర్సన్  విజయ లక్ష్మి,  అదనపు కలెక్టర్ లు హేమంత్, పి.రాంబాబు,  జిల్లా  అధికారులు తదితరుల పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!

కరోనాతో గాంధీ ఆస్పత్రిలో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ ప్రథమవర్ధంతి--- అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన జర్నలిస్టులు