కరోనాతో మృతి చెందిన కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుఆదుకోవాలి

 ఏషియన్ మీడియా నెట్వర్క్/ ఏ ఆర్ మీడియా
 హైదరాబాద్ జూన్ 27


కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రెండవ వేవ్లో లక్షలాది మంది అభాగ్యులు కరోనా వల్ల మరణించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఇంటికి ఆధారం అయిన కుటుంబ పెద్దలు  చనిపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఆర్ధిక సహాయం చెయ్యాలని అన్నారు


. జగత్ గిరి గుట్ట సీపీఐ పార్టీ నాయకులు మరెప్ప కరోనా వల్ల చనిపోవడంతో వారికి నేడు జగత్ గిరి గుట్ట శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి నాయకత్వన సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యేసు రత్నం, సీనియర్ నాయకులు సి.వెంకటేష్ లతో కలిసి నేడు వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్ధిక సహకారం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మారెప్ప సతీమణి మాధవి,వారి కుమారుడు సాయి,తరుణ్. లను కలిసి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ సీపీఐ పార్టీ సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు రాములు సిపిఐ శాఖ సభ్యులు ఇమామ్, చారీ,చంద్రయ్య, బాబు, నర్సింహ , రామాంజనేయులు శ్రీనివాస్ రెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్