*
ఏషియన్ మీడియా నెట్వర్క్
చిత్తూరు జిల్లా మాచారెడ్డి: జూన్ 21
ఆగి ఉన్న రెండు కార్లను మరో కారులో వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఢీ కొట్టారు.దీంతో సమీపంలోని ఇంటి ప్రహరీ గోడను ఢీ కొడుతూ కార్లు ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఇందులో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటన మండలంలోని ఘన్‌పూర్ బస్టాండ్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం........
రెండు కార్లను రోడ్డు పక్కన నిలిపి మాట్లాడుకుంటూ నిల్చొన్న ముగ్గురి పైకి మాచారెడ్డి వైపు నుంచి వస్తున్న మరో కారు వచ్చి అమాంతం ఢీ కొట్టడంతో దగ్గరలో ఉన్న ఇంట్లోకి చొచ్చుకుపోయాయి.
ఇందులో కాకులగుట్ట తండా సర్పంచి హెమ్ల నాయక్, ఉపసర్పంచి నరేశ్, గజ్యానాయక్ తండాకు చెందిన ఎల్లాగౌడ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.
వారిని కామారెడ్డిలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.
Comments
Post a Comment