సీఎం కెసిఆర్ దళిత సాధికారత పనిచేసేనా..? -- అసలుకే ఎసరు తెచ్చేనా..?

By: K.AshokReddy.Sr. Journalist, 
 ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా, 
హైదరాబాద్: జూన్ 29

దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.40 వేల  కోట్ల కార్పస్ ఫండ్ 

 సీఎం కెసిఆర్  దళిత సాధికారత పనిచేసేనా..?

 -- అసలుకే ఎసరు తెచ్చేనా..?

 -11,900 ల లబ్ధిదారుల కు ప్రయోజన మేలా..? - -- మిగతావారి సంగతి ఏంటి ..?

..ప్రభుత్వ నిర్ణయంపై దళితుల ఆక్రందన


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించారు. వరుసగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ తనదైన శైలిలో "ప్రజల మధ్యలో సీఎం' అనే విధంగా ప్రవర్తిస్తూ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు


. కాగా, వాసాలమర్రి లో ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనాలు కారణంగా ఊరంతా మంచం పట్టింది. దీంతో ఆగమేఘాల మీద గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆబాసు పాలు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, అందరికీ వైద్యం అందించింది. ఈ ఘటన నుంచి తేరుకున్నామనే సమయంలోనే, మరియమ్మ రూపంలో మరో అపఖ్యాతి వచ్చిపడింది.

దీనినికప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హడావిడి  అంతా, ఇంతా, కాదు. ఏకంగా దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.40 వేల  కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలమేధావులను పిలిచి ప్రగతి భవన్ లో పెద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సాధికారత కోసం ప్రతి దళిత కుటుంబానికి ఆదుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలను ఎంపిక చేసి, ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున అందజేస్తామని వరాల జల్లు కురిపించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో దళితులు అందరికీ ఆర్థికంగా సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు

. దీంతో కొంతమంది కెసిఆర్ అనుకూల వర్గం దళిత సంఘాలు, మేధావులు జబ్బలు చరుచుకున్నప్పటికి, ఇందులో దళితులకు ఆశించిన ప్రయోజనం లేదని కుండబద్దలు కొడుతున్నారు.


 ఆనాటి హామీలు ఏవి..?


 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సీఎం కేసీఆర్ దళితులకు సంబంధించి ప్రధానమైన హామీలను ఇచ్చారు. ఇందులో   ముఖ్యమైనది దళితులనే సీఎం చేయడం, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వటం వంటివి ఉన్నాయి.


2014 జూన్ 2న, తెలంగాణ రాష్ట్రం అవతరించిన వెంటనే ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి తానే స్వయంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక, మరో హామీ దళితులకు 3 ఎకరాల భూ హామీని 7 ఏళ్ల పాలనలో నెరవేర్చ లేకపోయారు. దళితులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ఇలాంటి  తాత్కాలిక నిర్ణయాలకు చెక్ పెట్టాల్సి ఉంది. దళితులపై నిజంగా సీఎం కేసీఆర్ కు ప్రేమ ఉంటే గత కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను వారికే పట్టాల రూపంలో సొంతం చేస్తే బాగుండేది
వ్యక్తమవుతోంది

. ఇప్పటివరకు అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న దళితుల అందరికీ, ఆ భూముల పై, సర్వాధికారాలు ఉండేవిధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. నిరుపేద  రైతు తనకు సొంత వ్యవసాయ భూమి ఉందని భరోసాతో ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని సాగిస్తాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి హామీని అమలుపరచినట్లయితే ప్రతి దళిత కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది



. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఒక్క ఎకరం కనీసం రూ. 10 లక్షలకు తక్కువ కాకుండా ధరలు పలుకుతున్నాయి. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా, దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిని అందిస్తే ఒక్కో కుటుంబం దాదాపు రూ. 30 లక్షల విలువైన నా భూమిని కలిగి ఉంటారు. అలా కాకుండా డబ్బుల రూపంలో దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున వారి వారి అకౌంట్లలో వేస్తే అవి ఏమేరకు ఫలితాలను అర్థం కాని పరిస్థితి నెలకొంది

. ఒక్కో నియోజకవర్గంలో 100 మంది దళిత లబ్ధిదారులను ఎంపిక తీస్తే మిగతా దళిత కుటుంబాల పరిస్థితి ఏంటి..?  అనే విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించిన దళిత సాధికారత అనే అంశం మేలు చేయకపోగా, కీడు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దళిత సాధికార తద్వారా అనేకమంది దళిత కుటుంబాలు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి

. ఎందుకంటే కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే ఈ సాధికారత వల్ల నిరసన వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్