మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అస్వస్థత ...అరగంట కొచ్చిన 108

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఈటెల రాజేందర్

 అరగంట తర్వాత అందిన ప్రాథమిక వైద్యం

ఈటల ప్రాణాల మీదకు తెచ్చిన పిఆర్వో నిర్వాకం

.. పాదయాత్రలో ఎమర్జెన్సీ మెడికల్ కిట్ లేకపోవడం వల్లే ఈ దుస్థితి

 ...అనుభవరాహిత్యం తో తప్పుదారి పట్టిస్తున్న పిఆర్ఓ 

..జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు..?


 ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా,

 హైదరాబాద్:జులై 30


 ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు సుదీర్ఘ పాదయాత్ర చేపడితే మెడికల్ పరంగా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్ల ఎన్నో అనర్ధాలు  చోటుచేసుకుంటాయి. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ చేస్తున్న ప్రజా దీవెన పాదయాత్ర లో ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది లేకపోవడం, దానికి సంబంధించిన వైద్య పరికరాలను సైతం సమకూర్చు కోకుండా చేయడంవల్ల ఈ ప్రమాదం సంభవించింది


. పాదయాత్రలో కచ్చితంగా అత్యవసర మెడికల్ సిబ్బందితో కూడిన వాహనాన్ని వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందులో  ఒక వైద్య అధికారితో పాటు ముగ్గురు సహాయకులు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవేమి గ్రహించకుండా ఇలాంటి పాదయాత్రలు చేయడం ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే అవుతుంది. రోజుకి దాదాపు రూ.  లక్షలు ఖర్చుపెట్టే పాదయాత్రలో మెడికల్ సిబ్బంది వాహనం లేకపోవడం విచారకరం.

పాదయాత్ర ప్రచార విభాగాన్ని నిర్వహిస్తున్న పిఆర్ఓ, కనీస అవగాహన లేకుండా చేయడం వల్లే ఇలాంటి దుష్పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ కు ఎలాంటి ప్రాణాపాయం  జరగకపోవడం అదృష్టం గా భావించవచ్చు.. ఏదైనా జరగరానిది, జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు..? అని ఈటల అభిమానులు కార్యకర్తలు ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో " ప్రజా దీవన'" పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాళ్ల నొప్పులు, గొంతు నొప్పి, తీవ్ర జ్వరం, బాడీపెయిన్స్ తో అల్లాడిపోతూ పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు.

దాదాపు 12 రోజుల పాటు నిర్వహించిన పాదయాత్రలో 222 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన ఈటల రాజేందర్ శుక్రవారం మధ్యాహ్నం తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. సడెన్ గా నడవలేని పరిస్థితిలో కిందపడిపోబోయారు. వెంటనే పక్కనున్న కార్యకర్తలు పరిస్థితిని గమనించి, స్థానికంగా జమ్మికుంట లో ఉన్న డాక్టర్స్ ను రప్పించేందుకు  ప్రయత్నం చేసినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు.

వెంటనే అక్కడున్న కార్యకర్తలు 108 కి డయల్ చేయగా అర్ధగంట తర్వాత వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే, ఈటల రాజేందర్ ను జమ్మికుంట లోని వైద్య సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించి శాంతన చేకూర్చారు. అనంతరం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తే గాని, అసలు విషయం బయట పడదని తేల్చారు. వెంటనే పాదయాత్ర ఆపేసి  విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దీంతో ఈటల రాజేందర్ తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ వేసి, హుజరాబాద్ లో తన నివాసానికి చేరుకున్నారు.


వాట్సాప్ చాటింగ్ దుమారం నిద్ర లేని ఈటల:


 దళితులు వ్యక్తిగత అనుచరులు పి ఏ పి ఆర్ వో లు నిర్వాకంపై వాట్సాప్ చాటింగ్ రేపిన దుమారం వల్ల ఈటల రాజేందర్ తీవ్రంగా కలత చెందారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా, తన చుట్టూ ఉన్న అనుచరులే కోవర్టు లుగా మారుతూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందినట్లు సమాచారం


. దీనికి సంబంధించి తీవ్రంగా ఆలోచిస్తూ, కంటి మీద కునుకు లేకుండా ఉండటం వల్ల, అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. లోకల్  మీడియాను నిర్లక్ష్యం చేయడం వల్ల, అది కాస్తా, వాట్సప్ గ్రూపులలో తిరుగుతూ చిలికి చిలికి గాలివానగా మారి "దళిత బంధు పథకం" వైపు మళ్ళింది. దీంతో నియోజకవర్గంలో అగ్గి రాజేసింది.

ఈ విషయం ఈటల కుటుంబంలో కూడా తీవ్ర నిరాశా నిస్పృహలను నింపింది. దీనికంతటికీ మూలకారణమైన  పిఎ, పిఆర్ఓ లను వెంటనే తొలగించాలని కుటుంబ సభ్యులు ఈటల పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యక్తిగత సిబ్బంది ఉండటంవల్ల,  అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని కుటుంబ సభ్యులు మదన పడుతున్నారు

[*

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్