నిండా ముంచుతున్న పిఏ, పిఆర్వో లు ... ఈటల పాదయాత్రకు కొరవడిన పబ్లిసిటీ


... ప్రజా స్పందన ఉన్నా మలుచుకోలేని దుస్థితి  

... రూ. లక్షలు ఖర్చు చేస్తున్న ప్రయోజనం శూన్యం 

By: K. AshokReddy.
 Senior journalist,
ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా 

హైదరాబాద్:జులై22...


 రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకట్టుకుంటు హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు, ఇతర పార్టీల నుంచి తీవ్రమైన ఆటంకాలు, ఎదురు దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఈటెల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన పీఏ, పీఆర్ఓ ల నిర్వాహకం వల్లే అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. రూపాయల ఖర్చుతో చేపడుతున్న పాదయాత్ర ప్రచార కార్యక్రమం ఆశించిన స్థాయిలో లో ప్రజా స్పందన ను తీసుకు రావడం లేదు. ప్రజల నుంచి ఈటెల పై అపారమైన సానుభూతి ఉన్నప్పటికీ, దానిని, తమకు అనుకూలంగా మలచుకునే విధంగా చేయడంలో విఫలమవుతున్నారని స్థానికులు వాపోతున్నారు


. దీనికి ప్రధాన కారణంగా తన దగ్గర పనిచేసే పిఆర్ఓ  చేస్తున్న నిర్వాకం వల్లనే ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 19న నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిన ఈటల రాజేందర్ కు మీడియా పరంగా ఆశించిన ప్రచారం రావడం లేదు. 25 రోజుల పాటు సాగే పాదయాత్రలో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈటెల రాజేందర్ చేస్తున్న ప్రచార పర్వం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.

రాజేందర్ ప్రచారం సందర్భంగా పేలుతున్న మాటల తూటాలు యావత్ నియోజకవర్గ ప్రజలను తట్టిలేపే విధంగా ఉంటున్నాయి. అయినప్పటికీ ఈ మాటల తూటాలు ప్రజలకు చేరవేసే విధంగా పబ్లిసిటీ రావడం లేదు.


 పిఆర్ఓ సొంత పబ్లిసిటీ:


 ఈటల రాజేందర్ వద్ద పనిచేసే పిఆర్ఓ తన సొంత పబ్లిసిటీ సైన్యాన్ని లక్షలాది రూపాయల ప్యాకేజీతో ఏర్పరుచుకోవడం జరిగింది. దీనివల్ల మీడియాలో పనిచేసే ప్రతినిధి బృందం ఈటెల రాజేందర్ పట్ల విముఖత వ్యక్తం చేస్తుంది.


ఆయన ప్రచార తీరుతెన్నులపై వార్తలు, రూట్ మ్యాప్ పబ్లిసిటీ లేక పోవడం వల్ల, ఆశించిన స్థాయిలో ప్రజలు స్పందించడం లేదు. ఆయన దగ్గర పనిచేసే పిఆర్ఓ సొంత అనుచరగణంతో సోషల్ మీడియా పేరుతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నారు తప్ప, పబ్లిసిటీ మాత్రం కానరావడం లేదు. పాదయాత్ర ప్యాకేజీ  రూ. 30 లక్షలు తీసుకుని సొంత మీడియాను ఏర్పాటు చేసి లోకల్, జిల్లా మీడియాను దూరం పెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు


. సొంత సోషల్ మీడియా వల్ల ఈటెల రాజేందర్ పాదయాత్ర ప్రచార పబ్లిసిటీ పూర్తిగా విఫలమవుతోంది.  ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నప్పటికీ, దానిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఈటల విఫలమవుతు న్నారని అని చెప్పవచ్చు. ఇకనైనా సోషల్ మీడియాకు ఖర్చుచేసే డబ్బులను, లోకల్, జిల్లా మీడియాకు మళ్లించినట్లైతే ఆశించిన ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.


 పిఏ, పిఆర్ఓ లు ఖరీదైన కార్లలో...


 హుజురాబాద్  ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పాదయాత్ర  ప్రచారం తో గల్లి గల్లి తిరిగి రోడ్డుపై భోజనాలు చేస్తుంటే, ఆయన దగ్గర పనిచేసే పి ఏ,  పి ఆర్ ఓ లు ఖరీదైన కారులో తిరుగుతూ, స్టార్ హోటల్ తిండి తింటూ జల్సాలు చేస్తున్నారు. పి ఆర్ ఓ పి పబ్లిసిటీ పేరుతో రూ. లక్షలు వెనకేసుకుంటూ  జల్సాలు చేస్తుంటే, పి ఏ మాత్రం అన్ని సామాజిక వర్గాలను ఈటల వైపు మళ్ళించడం పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు చేస్తూ దండుకుంటున్నట్లు సమాచారం.


ఇలా ఇరువురు అనుచరులు వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తూ, దండు కోవడమే పరమావధిగా పని చేస్తున్నట్లు స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపై ఈటెల దృష్టి సారించి మేల్కొని చర్యలు తీసుకుంటే, ప్రజల మనసులను గెలుచుకునే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు
.

Comments

Post a Comment

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్