ఈ రోజు నుండి పెరిగిన భూముల రెజిస్ట్రేషన్ చార్జీలు

ఏషియన్ మీడియా నెట్వర్క్ హైదరాబాద్ జూలై 22

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల మార్కెట్‌ విలువను గరిష్ఠంగా 50, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల విలువను గరిష్ఠంగా 30 శాతం పెంచారు. కొత్తగా నిర్ణయించిన భూముల ధరలు, పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు గురువారం నుంచి జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది


. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు, రుసుం చెల్లించిన వారు కూడా కొత్త ఛార్జీల మేరకే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు 58, 59, 60లను జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 2013 ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి అమలవుతున్నాయి. గత ఏడాది జనవరిలోనే విలువలు, ఛార్జీల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తమిళనాడులో 11 శాతం, కేరళలో 10 శాతం, ఆంధప్రదేశ్‌లో 7.5 శాతం ఉన్నట్లుగా పేర్కొన్న ప్రభుత్వం వివిధ సంప్రదింపులు, పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 7.5 శాతంగా నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. కొత్త ధరలు, ఛార్జీల రూపేణా అదనంగా సుమారు రూ. 3000 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

గతంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 6 శాతం (స్టాంపు డ్యూటీ 4 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ: 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతం)

💢కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 7.5 శాతం (స్టాంపు డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ: 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతం)

💢అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ చ.అడుగు కనీస ధర గతంలో రూ.800 ఉండగా, దాన్ని రూ.1000గా నిర్ణయించారు. ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్ల ధరలను 20 శాతం నుంచి గరిష్ఠంగా 30 శాతం వరకూ పెంచారు.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్