ముంపు బాధితులకు పాలు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసిన అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి
ఏషియన్ మీడియా నెట్వర్క్
నిర్మల్ జూలై 23
నిర్మల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో టీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి పర్యటించారు. నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ ముంపు బాధితులకు పాలు, ఆహార ప్యాకెట్లను అందజేశారు.
ముంపు బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విపత్తుల సమయంలో తోటి వారికి సహాయం అందించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు
. ఇలాంటి సమయంలో ముందుకొచ్చి బాధితులకు బాసటగా నిలవాల్సిన బాధ్యత మనం అందిరిపై ఉందన్నారు. వరద బాధితులను ఆదుకునే తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు
. డైరీ చైర్మన్లోకా భూమా రెడ్డి,తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, స్థానిక నాయకులు ఆన్వార్, అకోజి కిషన్, దశరత్,రవి తదితరులు ఉన్నారు..
Comments
Post a Comment