మంగ్లీ బోనాల పాట పై హిందూ సంఘాల ఆగ్రహం
ఏషియన్ మీడియా నెట్వర్క్ హైదరాబాద్ జూలై 21
*సింగర్ మంగ్లీపై పిర్యాదు*
హైదరాబాద్‌లో సింగర్ మంగ్లీపై బీజేపీ కార్పొరేటర్లు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని, సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని డిమాండ్ చేశారు.
పండుగల సందర్భంగా మంగ్లీ పాడిన ప్రత్యేక గీతాలు విడుదల అవుతూ ఉంటాయి.
ఈ నెల 11న మంగ్లీ పాడిన బోనాల పాట విడుదల అయింది.
ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
‘చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా’ అంటూ ఈ పాట సాగుతూ ఉంటుంది.
అయితే ఈ పాట లిరిక్స్ హిందూ దేవతలను కించపరిచేలా ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి
Comments
Post a Comment