Asian Media Network A.Vijayendar Reddy Correspondent Hyderabad May 30, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సుధీర్ఘంగా సాగిన సమావేశం, పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 నుంచి ) మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది . సడలింపు సమయంలో బయటకు వెల్లినవాల్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు, (సడలింపు సమయానికి అధనంగా) అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులు బాటు ఉంటుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా లాక్ డౌన్ ను అత్యంత కఠినంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.... లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో కొవిడ్ , లాక్ డౌన్ సడలింపు నిబంధనలను అనుసరించి. ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ , రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనా...
Comments
Post a Comment