కరోనాతో గాంధీ ఆస్పత్రిలో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ ప్రథమవర్ధంతి--- అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన జర్నలిస్టులు
Asian Media Network
Hyderabad June 7
జర్నలిస్ట్ మనోజ్ ప్రథమవర్ధంతి--- రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించిన జర్నలిస్టులు
జర్నలిస్టులను వెంటనే ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద గుర్తించాలి
ఉపాధి కోల్పోయిన జనులకు ప్రతినెల 10,000 ఆర్థిక సాయం చేయాలి
కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి కనీసం యాభై వేలు ఇవ్వాలి
ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించాలి
:గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్యానికి కరోనా తో మృతిచెంది ఏడాది గడిచినా జర్నలిస్ట్ మనోజ్మొదటివర్ధంతినిపురస్కరించుకొని గన్ పార్కులో నివాళులర్పించిన జర్నలిస్ట్ లు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ మాట్లాడుతూ సరైన వైద్యం అందక ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తంచేశారు
.చనిపోయిన మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటివరకుఆదుకోకపోవడంవిచారకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి, కరోనానుఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు వైద్యం అందించాలన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ఎందుకు అమలుచేయడంలేదనిప్రశ్నించారు.కరోనామరణాలుప్రభుత్వహత్యలేతీవ్రంగావిమర్శించారు.అనంతరం సీనియర్ జర్నలిస్టు బాగిలి సత్యం మాట్లాడుతూ.
... కరోనా నా సృష్టించిన విలయం కంటే కాసుల కోసం కార్పొరేట్ ఆసుపత్రులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం సృష్టించిన ప్రళయం వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలి పోయాయని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కరోనా మనిషిని చంపలేదని మనుషులే మనుషుల ప్రాణాలను హరించి వేశారన్నారు.నిజానికి కరోనా ప్రాణాలు తీసేటంతా పెద్ద వ్యాధి కాదు కానీ సకాలంలో చికిత్స అంధక, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించలేక పోవడంతోప్రజలప్రాణాలకుదిక్కులేకుండాపోయిందన్నారు.కార్పోరేట్ ఆసుపతృల్లో కరోనా చికిత్స పేరుత ఫ్రెంట్ డోర్ లొ ఒక్కకరితో 78లక్ష లు 50లక్షల,28లక్షలు తక్కువలో తక్కువ 6లక్ష్యల మూటలను దోచుకుని బ్యాక్ డోర్ లొ శవాల మూటలను అప్పగించినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుచూస్తుండిపోయిందన్నారు. మెడికల్ మాఫియాను అరికట్టలేక పోవడం ప్రజల ప్రాణాలకు శాపంగా మారిందన్నారు. మిగతా రాష్ట్రాలుప్రైవేట్ ఆస్పత్రిలోదోపిడీనినియంత్రించినతెలంగాణరాష్ట్రంపూర్తిగావైఫల్యంచెందిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరొనా ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్ కూడా పూర్తిచేయకపోవడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇప్పడి కైనా ప్రభుత్వం మేల్కొని తక్షణ చర్యలు చేపట్టి జర్నలిస్ట్ లను,ప్రజలనుఆదుకోవాలనివిజ్ఞప్తిచేశారు.కాంగ్రెస్నాయకులు రాజేష్ యాదవ్, మోటా రోహితులు జర్నలిస్టులకు మద్దతు తెలుపుతూ మనోజ్ కు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సాయి కిరణ్, సిద్ధూ,విజయేందర్ రెడ్డి,జి రామనాయుడు, వెంకట్, మున్నా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment