తెలంగాణలో "రాజన్న రాజ్యం" కోరింది ఎవరు..?.

 షర్మిలమ్మ ఏంది నీ డ్రామా ..?

తెలంగాణలో నీ అస్తిత్వం ఏంటి..?

.. మరోమారు "జాగో భాగో" కు సిద్ధంగా ఉండు..

 ..త్వరలో  మళ్లీ మానుకోట గతి తప్పదు.. 

షర్మిలకు తెలంగాణవాదుల ఘాటు హెచ్చరిక 

By: K.AshokReddy,
Senior Journalist
Ph: 9603322489
ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా

 హైదరాబాద్ :june30


షర్మిలమ్మ ఏంది నీ డ్రామా కంపెనీ...  అసలు నీవు పెట్టే డ్రామా కంపెనీ లో బుడ్డర్ఖాన్ లు ఉన్నారా..  అయితే, వారితో జోకులు వేయించుకొని కాలం గడుపు.. అంతేకానీ తెలంగాణ  జోలికి వస్తే మరోమారు "జాగో భాగో" నినాదంతో తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో  సమైక్యవాదిగా ఉన్న మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తెలంగాణ వాదులు మానుకోట రాళ్ల దాడి చేసిన ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకో...


  ఈ సంఘటన కు మించిన ప్రతిఘటన ను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తెరిగి మసలు కోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో  "రాజన్న రాజ్యం" కోరింది ఎవరు..? అసలు తెలంగాణలో  "రాజన్న రాజ్యం' కావాలని అడిగింది ఎవరో చెప్పాల్సిన అవసరం షర్మిల పై ఉంది. ఆదినుంచి తెలంగాణకు అన్యాయం చేసి, ఇక్కడి సహజ వనరులను దోపిడీ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కి మాత్రమే దక్కుతుంది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ తెగనమ్మి ఆంధ్రకు పెట్టడం లో ఆయనకాయనే సాటి.

అలాంటి పెద్ద మనిషి, హైదరాబాదులో ఫ్యాక్షనిజం పేరుతో భూములన్నీ యథేచ్ఛగా కబ్జాలు చేసి  ఆక్రమించుకున్నారు. ప్రభుత్వాన్ని నడిచినప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో రూ. లక్షల కోట్ల దోపిడిని చేసి తెలంగాణను కొల్లగొట్టిన ఘనత ఆయనకే దక్కింది. తెలంగాణ రాకుండా అడ్డుకున్న ఘనత వహించిన మహానేత.  పైగా, ఆయన పరిపాలనలో అంతర్గతంగా మీరు, మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి రూ.లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు.

అలాగే సమైక్యాంధ్ర నినాదంతో జగన్మోహన్ రెడ్డి  సాక్షాత్తు పార్లమెంటులోనే ప్లకార్డులు చేతబూని తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన బద్ద శత్రువు గా మిగిలిపోయారు. అలాగే తెలంగాణకు సంబంధించిన కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారు

. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను తెలంగాణ నుంచి లాక్కొని అన్యాయం చేశారు. ఈ రెండు అంశాలపై షర్మిల తెలంగాణ ప్రజలకు సరైన సమాధానం చెప్పి ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని సాధించేందుకు తెలంగాణకు మద్దతుగా సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపడతారా చెప్పండి..? కృష్ణానది నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. దీనిపై కృష్ణా నది తీరంలో తెలంగాణకు అనుకూలంగా ఏపీ సీఎం కు వ్యతిరేకంగా నిరసన ధర్నా కార్యక్రమాలు చేసే దమ్ము ధైర్యం మీకుందా..?

  అంటూ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా తెలంగాణ పై, మీకు, ప్రేమ ఉంటే ముందుగా కృష్ణా నది తీరం వద్ద ఏపీ సీఎం కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో మీరు చెప్పేవన్నీ కల్లబొల్లి మాటలని మరోసారి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటారు.
 


పీసీసీ అంశం మీకెందుకు..?


 కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర పి సి సి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని నియమించిన అంశంపై షర్మిలకు ఏమి సంబంధం..? కాంగ్రెస్ పార్టీ ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలి అనేదాని పై షర్మిల చెప్పినట్లు ఎందుకు చేయాలి..? 


ఆ పార్టీ కి సంబంధించిన అంతర్గత  విషయాన్ని ఈమె ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నట్లు..? ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పి సి సి అధ్యక్షుడి అంశంపై మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ మీ తెలియని అపరిపక్వత తో షర్మిల  చేస్తున్న ప్రకటనలు చూసి తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారు


. కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా, ఏది పడితే అది,  మాట్లాడితే, ఆంధ్ర ప్రదేశ్ జనాల మాదిరిగా, తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని షర్మిల గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విషయమైనా  మాట్లాడితే దానిపై సంపూర్ణంగా అవగాహన చేసుకొని ముందుకు సాగితే బాగుంటుంది. రాజకీయ పరిపక్వత లేకుండా రాజన్న రాజ్యం పేరుతో తెలంగాణలో చేయాలనుకున్న డ్రామాలను ఇక్కడి ప్రజలు తిప్పి కొడతారు. అడుగడుగునా అవమానిస్తారు... తస్మాత్ జాగ్రత్త .. తెలంగాణ తో పెట్టుకోకు...

  మరో మానుకోట తెచ్చుకోకు... సమైక్యవాదులు  ఇక్కడ అడుగు పెడితే యావత్ తెలంగాణ ఏకమై మీలాంటి వాళ్లను తరిమి తరిమి కొడతారని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్