నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పేయ్‌*

 ఏషియన్ మీడియా నెట్వర్క్ 
కర్నూల్ జూన్ 24.  

నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పేయ్‌*
*నంద్యాల: నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారిణి చాహత్‌ బాజ్‌పేయ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌  ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌ ఐఐటీ నుంచి బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రురాలైన ఈమె 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఏపీ కేడర్‌ అధికారిణి. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఆమె సివిల్‌ సర్వీసెస్‌లో 59వ ర్యాంకు సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శిక్షణ ఐఏఎస్‌గా ఉన్న చాహత్‌ బాజ్‌పేయ్‌కి నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి కల్పనా కుమారి నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా పనిచేసి పదోన్నతిపై విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌)గా వెళ్లారు. ఆమె స్థానంలో ఇన్‌ఛార్జి ఆర్డీవోగా వెంకట నారాయణమ్మకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మరోసారి నంద్యాలకు సబ్‌ కలెక్టర్‌గా మహిళనే నియమించడం విశేషం. 1996 తర్వాత నంద్యాలకు గతేడాది సబ్‌ కలెక్టర్‌గా కల్పనాకుమారిని నియమించారు
.
*

Comments

Popular posts from this blog

విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!

కరోనాతో గాంధీ ఆస్పత్రిలో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ ప్రథమవర్ధంతి--- అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన జర్నలిస్టులు

యండమూరి వీరేంద్రనాథ్ తాజా చిత్రం"అతడు-ఆమె-ప్రియుడు"