ఫామ్ హౌస్ రహదారి కోసమే ; నా "వాసాలమర్రి....!.

 

వాసాలమర్రి పై ఎందుకు అంత ప్రేమ
.. ఫామ్ హౌస్ రహదారి కోసమేనా..? 
...భూ నిర్వాసితులకు పట్టించుకోరా..? 
...భూములు పోయిన గ్రామాలన్నిటినీ దత్తత  తీసుకోండి 
...అప్పుడే సమన్యాయం
... సీఎం కేసీఆర్ తీరుపై భూ నిర్వాసితుల ఆక్రందన 
 .

రోడ్డు నిర్మాణం కోసమే వాసాలమర్రి పై ప్రేమ ... కోమటిరెడ్డి  

By: K. Ashok Reddy, 
Sr. Journalist, 
ఏ ఆర్ మీడియా/ ఏసియన్ మీడియా
,హైదరాబాద్ జూన్ 22 

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సడెన్ గా వాసాలమర్రి పై ప్రేమ ఎందుకు కలిగింది..? వారి ఆకలి తీర్చడానికా..? ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయటానికా--? అంటే అవుననే చెప్పాలి. ఇందులో ఫామ్ హౌస్ రహదారి లింకుపై ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. అందుకే ఎన్నడూ లేనిది సహపంక్తి భోజనాల లో గ్రామస్తుల అందరికీ కడుపునిండా భోజనం పెట్టించి, గొప్ప కార్యంను నిర్వహించారు.

వాసాలమర్రి మరో ఎర్రవల్లి గా తీర్చిదిద్దుతానని వరాల జల్లు కురిపించారు. గ్రామాభివృద్ధికి డబ్బులు లెక్క కాదని, ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధమేనని సీఎం ప్రకటించారు. సీఎం స్వయంగా మీ చెంత ఉండటం వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయని, అంతా సంఘటితంగా ఉండి అభివృద్ధిని ఆకాంక్షించా లని సూచించారు.

ఓకే, ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ నభూతోనభవిష్యత్ అన్నట్లుగా ఉన్నాయి. కాగా తన ఫాంహౌస్ నుంచి యాదాద్రి కి వెళ్లడానికి ఆరు వలయాల రహదారిని నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. అయితే ఈ రహదారి కింద పోతున్న భూములకు సంబంధించి నిర్వాసితులకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే వాసాలమర్రి గ్రామంలో కూడా రహదారి కింద వారి భూములు కోల్పోవడం జరిగింది. దీనికి నిరసనగా ఆ గ్రామ ప్రజలు  గతంలో రహదారికి అడ్డంగా నిల్చుని ముఖ్యమంత్రి ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో మాట్లాడి వాసాలమర్రిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదంతా తన ఫాంహౌస్ నుంచి నేరుగా యాదాద్రికి చేరుకోవడానికి 6 వరుసల రహదారి నిర్మించేందుకు వాసాలమర్రి గ్రామస్తులను శాంతింపజేసినట్లు కనబడుతోంది. 5 గ్రామాల్లో భూ నిర్వాసితులు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి యాదాద్రి వరకు నిర్మించే 6 వరసల రోడ్డు నిర్మాణంలో భాగంగా  ప్రజలు తమ వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.

అసలే తక్కువ మొత్తంలో భూములు ఉన్న సన్నకారు రైతులు ఉన్న కాస్త భూమిని రోడ్డుపాలు చేసి, తాము రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని దీనంగా వాపోతున్నారు. ఈ అన్యాయాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు విన్నవించిన ఫలితం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, స్వయంగా ముఖ్యమంత్రి రోడ్డు నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంతో అధికారులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం

. ఫామ్ హౌస్ నుంచి యాదాద్రి కి వెళ్లేందుకు చేపడుతున్న రోడ్డు నిర్మాణం లో  భాగంగా తుర్కపల్లి, దత్తాయ పల్లి, వెంకటాపురం, వాసాలమర్రి, కొండాపూర్ గ్రామాల ప్రజల ఇండ్ల తో  పాటు వ్యవసాయ భూములను సైతం కోల్పోతున్నారు. ఈ 5 గ్రామాల ప్రజలు నిత్యం తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సంబంధిత రెవెన్యూ  అధికారులకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ, వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా ఈ గ్రామాల నుంచి నిర్మాణం చేపట్టే రహదారి కోసం భూనిర్వాసితుల తో మాట్లాడకుండానే కొలతలు వేసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, అధికారులు పట్టించుకోకుండా తమ పనులు నిర్విఘ్నంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.

ఇదేమని ప్రశ్నిస్తే సీఎం పేరు చెప్పి భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఏకరువు పెడుతున్నారు. ఈ సమస్య పరిష్కారించాలంటే భూములు, ఇళ్ళు కోల్పోతున్న మిగతా 4 గ్రామాలను  సీఎం దత్తత  తీసుకోవాలిసిన అవసరం ఉన్నది.




 కరోనా అంటుకుంటే బాధ్యులెవరు..? 

సీఎం కేసీఆర్ వాసాలమర్రి లో ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనాలు వల్ల కరోనా విజృంభిస్తే బాధ్యులు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలే రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగానే  నమోదవుతున్నాయి

. రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అనేక రకాలుగా జరిమానాలు విధించింది. అయితే ఈ సహపంక్తి భోజనాల్లో ఎంతమంది  మాస్కూలు పెట్టుకున్నారు...? మస్కులుంటే భోజనం ఎలా చేస్తారు..?  అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే సమాధానం లేని ప్రశ్నలే మిగులుతాయి

. సహపంక్తి భోజనాల్లో మాస్కుల ఈ విషయం పక్కన పెడితే సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకపోవడం గమనార్హం. దాదాపు 4 వేల మంది సహపంక్తి భోజనాలు చేశారు. ఇందులో కొంతమందికైనా కరోనా వ్యాధి ఉన్నట్లయితే అది మిగతా వారిని చుట్టుముడితే దీనికి కారణం ఎవరు అవుతారు..?

  అసలే నిరుపేదలైన గ్రామ ప్రజలు, కరోనా బారిన పడితే వారి పరిస్థితి ఏంటి.. ? అనే అంశాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. స్వయంగా సీఎం ఇలాంటి కార్యక్రమాల ను నిర్వహించడం వల్ల అధికారులు నిస్సహాయంగా చూస్తూ ఉండి పోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది

తన స్వార్థం కోసమే వాసాలమర్రి... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తన నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు తనను పిలవకపోవడం భువనగిరి పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారుఇది ప్రోటోకాల్ను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు

ఈ మేరకు కు వెంకట్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి ఇ వాసాలమర్రి మీద ప్రేమతో రా లేదని తన ఫామ్ హౌస్ కి నాలుగు లైన్ల రహదారి నిర్మించుకోవడానికి అడ్డంకిగా ఉన్న రైతులను మచ్చిక చేసుకోవడానికి భోజనాలు గ్రామసభ పేరిట  కొత్త నాటకానికి తెరలేపారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు కెసిఆర్ మోసాలను రూపాలను ప్రజలకు వివరించేందుకు త్వరలో ఆ ప్రాంతంలో పర్యటిస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్