పోలీస్ కార్యాలయాలు, స్టేషన్లలో పరిశుభ్ర, మెరుగైన సేవలకుగాను 5-ఎస్ విధానం అమలు - డి.జి.పి మహేందర్ రెడ్డి


ఆసియన్ మీడియా నెట్వర్క
ఏ విజయేందర్ రెడ్డి
 స్పెషల్ కరస్పాండెంట్ 

హైదరాబాద్, జులై 28:*  

రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ తో పాటు పోలీసు కార్యాలయాలను పరిశుభ్రమైన, మెరుగైన సేవలందించేందుకు అనువైన వాతావరణం ఉండేందుకు Sort, Set In Order, Shine, Standardize, Sustain అనే 5-S విధానాన్ని అమలు చేస్తున్నట్లు డి.జి.పి మహేందర్ రెడ్డి తెలియజేశారు


. 5-ఎస్ అమలు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ కార్యాలయాలు, స్టేషన్లలో వ్యర్థ వస్తువుల తొలగింపు, విధి నిర్వహణకై పోలీసులకు అందజేసే కిట్ ల పంపిణీకి రూపొందించిన వెబ్ అప్లికేషన్ నిర్వహణ తదితర అంశాలపై నేడు రాష్ట్రంలోని 9 పోలీస్ కమిషనరేట్లు,  20 జిల్లాల ఎస్.పి కార్యాలయాల ఆర్.ఐ లతో సమావేశం నిర్వహించారు. లాజిస్టిక్స్ విభాగం ఐ.జి సంజయ్ జైన్, స్టోర్స్ డి.ఎస్.పి వేణుగోపాల్ లు హాజరైన ఈ సమావేశంలో డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలులో భాగంగా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, పోలీసు కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఉత్తమ సేవలు అందించే వాతావరణం కల్పించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఇప్పటికే ఈ 5-ఎస్ విధానం రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో అమలు అవుతుందని, దీనిని పకడ్బందీగా కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పోలీసు కార్యాలయాలు, స్టేషన్లలో గత 15 ఏళ్లుగా వృథాగా ఉన్న పాత, వ్యర్థ పరికరాలను నిబంధనలను అనుసరించి వేలం (ఆక్షన్) ద్వారా తొలగించాలని ఆదేశించగా  29 పోలీసు యూనిట్ల ద్వారా వేలం వేయగా వచ్చిన 50,35,000 రూపాయలను  ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం జరిగిందని వివరించారు. విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బందికి అందజేసే రెయిన్ కోర్టులు, గ్రౌండ్ షీట్లు, ఉలెన్ బ్లాంకెట్లు, స్వెటర్లు తదితర వస్తువులు కలిగిన కిట్ లను సకాలంలో అందజేసేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించామని వెల్లడించారు

. ఈ యాప్ ద్వారా పోలీసు సిబ్బందికి వారి అర్హత మేరకు అందించే కిట్ ల పంపిణీని డి.జి.పి కార్యాలయం నుండి నేరుగా  పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ యాప్ లో 44,282 మంది పోలీసు సిబ్బంది వివరాలను నమోదు చేయడం జరిగిందని చెప్పారు. వరంగల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల పోలీసు సిబ్బంది వివరాలను ప్రయోగాత్మకంగా ఈ యాప్ లో నమోదు చేశామని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకుగాను పోలీసు సిబ్బందికి డి.జి.పి కార్యాలయం ద్వారా పెద్ద సంఖ్యలో కిట్ లను జిల్లా పోలీసు కార్యాలయాలు యూనిట్ల ద్వారా పంపిణీ చేసే విధానం ఉందని, ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ ద్వారా వీటి పంపిణీ ఏవిధమైన జాప్యం లేకుండా సకాలంలో అందించేందుకు వీలవుతుందని డి.జి.పి పేర్కొన్నారు

. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న ఐ.జి సంజయ్ జైన్, డి.ఎస్.పి వేణుగోపాల్ లను డి.జి.పి అభినందించారు. పోలీసు కార్యాలయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద చూపించిన పలు జిల్లాల ఆర్.ఐ లకు డి.జి.పి మహేందర్ రెడ్డి ప్రశంస పత్రాలు అందజేశారు.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్