కార్గిల్ యుద్ధ వీరుడు కమాండర్ మనోజ్ పాండే ..

 ఏషియన్ మీడియా నెట్వర్క్
 న్యూస్ డెస్క్ జూలై 28


"1997 ..1/11 గూర్ఖారెలిజిమెంట్ ..దుర్గాపూజ జరుగుతుంది..జవానులంతా ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు.కొత్తగా కంపెనీలోనికి జాయిన్ అయిన 22 యేండ్ల యువజవాన్ పిలిచాడు కల్నల్ .అతని చేతిలో "ఖుఖ్రీ" (ముఖాముఖి పోరులో మన జవాన్స్ ఉపయోగించే అత్యంత ఉపయోగకరమైన ఆయుధం అది. శత్రువుల తలలనూ సహితం వేరుచేయడం నేర్పుతారు దానితో) పెట్టి ఒకమేకపోతును చూపుతూ నీ మనసులో కోరిక కోరుకొని దానిని బలి ఇవ్వూ నీ కోరిక తీరుతుందన్నాడు.ఒకక్షణం


తటపటాయించాడాయువకుడు.తర్వాత ఖుఖ్రీతో మేకతలను వేరుచేసాడు..అతని మొహమంతా మేకరక్తంచిమ్మ ఎర్రబడింది.గిలగిలకొట్టుకుంటూ ప్రాణం విడుస్తున్న మేక వైపు తథేకంగా చూసాడాయుకువకుడు.మౌనంగా తన గుడారానికెళ్ళాడు.ఏదో అపరాధభావం. నాలుగైదుసార్లు ముఖం కడుక్కొన్నాడు..ఆ సంఘటన తరువాత మళ్ళీ జీవితంలో మాంసం మద్యం జోలికిపోకూడదనుకున్నాడు..అలాగే ఉండిపోయాడు.

    అయితే 14 నెలలు గడిచేసరికే అతను శత్రువులను నిర్ధాక్షణ్యంగా ముట్టుబెట్టేస్తాయికి ఎదిగాడు.కరుడుగట్టిన కమెండోగా మారిపోయాడు. చాలా ఆపరేషన్స్ లో పాల్గొని కరుడుగట్టిన ఉగ్రవాదులను కాల్చిచంపాడు..ఎన్నో రిస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నాడు.అతనంటే పై అధికారులకు ఒక గౌరవం. ఆ యువకుడి పేరు మనోజ్ పాండే. చిన్నతనం నుండే అతనికి సైనికుడు కావాలని కోరిక.అందుకే సైనికస్కూల్ లో చేరి,NDA కు సెలెక్ట్ అయి శిక్షణ పొంది,గూర్ఘా కంపెనీకి కెటాయింపబడ్డాడు.


   1999 జూన్ సియాచిన్ నుండి విధులు ముగించుకొని వస్తుండగా వెంటనే టైగర్ హిల్స్ కు రమ్మని పై అధికారులనుండి వర్తమానం.వెంటనే టైగర్ హిల్స్ కు తన బృందముతో వెళ్ళాడు పాండే.అక్కడకు వెళ్ళిన తరువాత తెలిసింది ఆ హిల్స్ ను శత్రువులు ఆక్రమించారని. కల్నల్ లలిత్ రాయ్ ఆధ్వర్యంలో రెండు కంపెనీల జవానులబృంధం ఆ కొండలవైపు కదిలింది.

    1999 జూలై 3 టైగర్ హిల్స్ లోని ఖాలోబార్పర్వతం..పైనుండి శత్రుసైనికులు రక్షతస్థానంలో వున్నారు.మన సైనికులు కదిలితే చాలు మిషీన్ గన్స్ గర్జిస్తున్నాయి.అడుగువేయలేని పరిస్థితి.విధిలేని పరిస్థితిలో కల్నల్ లలిత్ రాయ్ ..మనోజ్ పాండేను పిలిచి ,కెప్టన్ పైన నాలుగుఫోష్టులున్నట్లున్నవి.వాటిని ద్వంసంచేసే పని మీకు ఒప్పగిస్తున్నాను..జాగ్రత్తగా డీల్ చేయమన్నాడు,.యస్ సర్ అని సెల్యూట్ చేసి,తనతో మరో ఏడుగురుని తీసుకొని టైగర్ హిల్స్ వైపు సాగిపోయాడు


పాండే.ఖాలోబోల్ శిఖరం పాక్ కు అత్యంత ప్రధానమైనది. దాని కమ్యునికేషన్ హబ్ అది.దానిని పట్టుకొంటే వారికి ఆహారం,ఆయుధసరఫరాను అడ్డుకోవచ్చు. ఒక్కక్షణం ఆలోచించాడు పాండే..పాక్ జవాన్స్ వచ్చే ఇరుకైన దారినే ఎంచుకున్నాడు. అది చాలా ప్రమాదకరమైనదని తెలుసు అయినా తప్పదు. భుజాన బ్యాక్ బ్యాగులతో ,లీటరు నీటిబాటిల్స్ తో పర్వతం ఎక్కడం ప్రారంభించారు. తమ మార్గం నుండి శతృవులు ఎటాక్ చేయరనే ధైర్యంతో పాక్ జవాన్స్ వున్నారు. నాలుగు గంటలు కష్టపడి శిఖరంపైకి చేరాడు పాండే.అయితే అక్కడ నాలుగుకాదు! ఆరు పోష్టులున్నాయి,,పరిస్థితి లలిత్ రాయ్ చెప్పి..తన సహచరుడికి రెండు ఫోష్టులు పేల్చేయని చెప్పి ,తను మిగతా నాలుగు ఫోష్టులవైపు కదిలాడు..తన సహచరుడు రెండుఫోష్టులను పేల్చేసాడు..కానీ దురదృష్టపుశాత్తూ తనూ మరణించాడు..

   మొదటిరెండు ఫోష్టులను గ్రెనేడ్స్ విసిరి పేల్చేసాడు పాండే.. మూడో పోష్టు లోనికి గ్ర్రెనేడ్ విసురుతుండగా శత్రుజవానులు గమనించి కాల్పులు జరపడంతో ఎడమభుజం రక్తంతో తడచిపోయింది..అయినా గురితప్పని అతని గ్ర్రెనేడ్ వారి శరీరాలను చిన్నాభిన్నంచేసింది. రక్తం కాలుతున్నా నాలుగో ఫోష్టువైపు కదిలాడు పాండే.సహచర జవాన్స్ సాబ్ మీరు చాలా గాయపడ్డారు,దానిని మేము పేల్చేస్తాం..మీరు రెష్ట్ తీసుకోండని చెప్పారు. అయినా వారి మాట వినకుండా మీకు అంత అనుభవంలేదు..తేడా వస్తే శత్రువులు నిర్ధాక్షణ్యంగా చంపేస్తారు..పర్వాలేదు..అంటూ నాలుగో బంకర్ వైపు పాములా పాకుతూ దగ్గరకు చేరి గ్ర్రెనేడ్ తీసి విసరివేస్తుండగా శత్రువులు గమనించి ఫైరింగ్ చేయడంతో పాండే తల నుండి రైఫిల్ తూటా దూసుకెళ్ళింది. అయితే అతను విసిరిన గ్ర్రెనేడ్ గురితప్పలేదు.వెళ్ళి బంకర్ లో పడటం నాలుగైదు శత్రుసైనికుల శరీరాలు గాలిలో లేయడం జరిగింది.


మిగిలినవారు పారిపోతుండగా"నా ఛోడ్నా"(వారిని వదలొద్దు) అంటూ కన్నుమూసాడు మనోజ్ కుమార్ పాండే. వెంటనే భారతజవాన్స్ ఖుఖ్రీలు తీసి పెద్దగా అరుస్తూ పాక్ సైనికులపై పడి వారి తలలను నేలకూల్చారు..ఈ సంఘటన జరిగేటప్పటికి కెప్టన్ మనోజ్ కుమార్ పాండే వయసు కేవలం 24 సంవత్సరాలా ఏడురోజు మాత్రమే.

    "మిలిటరీలో ఎందుకు చేరాలనుకుంటున్నావని అడిగిన ప్రశ్నకు పరమవీర్ చక్ర కోసం అని చెప్పిన మనోజ్ మాటలు నిజం అయినాయి.పరమవీర్ చక్ర అవార్డ్ అతని తరుపున నాన అందుకున్నాడు. 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో మనోజ్ పాండే ధైర్యసాహసాలు చాలా గొప్పగా చెప్పుకుంటుంది భారతమిలటరీ!!

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్