హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..!


... తెలంగాణలో మరో 2 నెలల తర్వాతే ఎన్నికలు
... కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన తెలంగాణ సర్కార్
... ముంచుకొస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ భయం

K.Ashok Reddy,
Senior Journalist
Hyderabad.


 ఏఆర్ మీడియా/ ఏషియన్ మీడియా, 

హైదరాబాద్: జులై 31


 తెలంగాణ రాష్ట్రంలో  మరో రెండు నెలల వరకు ఇలాంటి ఎన్నికలు లేనట్టే..  ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో కోవిడ్ పుణ్యమా అంటూ ఎన్నికలకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి.


ఇప్పటికే నియోజకవర్గంలో "ఢీ అంటే ఢీ" అనే స్థాయిలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకున్నది. యావత్ రాష్ట్రం హుజరాబాద్ ఉప ఎన్నికపై దృష్టిని కేంద్రీకరించిన నేపథ్యంలో, కోవిడ్ వైరస్ వల్ల మరో రెండు నెలల పాటు తెలంగాణలో జరగాల్సిన అన్ని ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. ఇప్పటికే కోవిడ్ వల్ల అతలాకుతలమైన రాష్ట్రంలో మరోమారు ఎన్నికలు నిర్వహించి ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది.

ఇటీవల కాలంలో జిహెచ్ఎంసి, దుబ్బాక,  నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కోవిడ్ సెకండ్ వేవ్ దాటికి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేలాది మంది ఆస్పత్రిలో చేరి, లక్షలాది రూపాయలను పోగొట్టుకొని, చావు అంచుల లోకి వెళ్లి, తిరిగి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే పెను ముప్పు సంభవించి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించినట్లు ఉంది.

ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసినప్పటికీ, వాటికి ఎన్నికలు నిర్వహించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి సిఫారు చేయలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, వాటిని పక్కన పెట్టింది. తాజాగా శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు, ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా 
ఉన్నాయా..?  అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది.

దీనికిగాను సి ఎస్ మరో రెండు నెలల పాటు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో జరగాల్సిన ఎమ్మెల్సీ కోట ఎన్నికలతో పాటు హుజురాబాద్ ఉప ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం లేదు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో హుజరాబాద్ లో రాజుకుంటున్న ఉప ఎన్నికల వేడి కాస్త    చల్లారనుంది.

 

 తెలంగాణలో సినిమా థియేటర్లు ఫుల్,
 ఎన్నికలు  వాయిదా:


 రాష్ట్రంలో థర్డ్ లైవ్ ముప్పు పొంచి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో జరగాల్సిన అన్ని ఎన్నికలను మరో రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరినప్పటికీ, సినిమా థియేటర్లు 100 శాతం సీట్ల భర్తీకి పర్మిషన్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.


రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్ లకు పర్మిషన్ ఇవ్వడం వల్ల మరోమారు కోవిడ్ విజృంభించి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా, పక్క రాష్ట్రాల్లో కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండగా, రాష్ట్రంలో మాత్రం, ఎలాంటి, నిబంధనలు లేకుండా, విచ్చలవిడిగా, వదిలేయడం వల్ల కరోనా పంజా విప్పే అవకాశాలు మెండుగా  ఉన్నాయి.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్