ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్
Asian Media Network
- ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన
- గతంలో ఆఫ్ఘన్ సైనికులకు ఆయుధాలిచ్చిన అమెరికా
- ఇప్పుడా ఆయుధాలు తాలిబన్ల పరం
- ఆయుధ సరఫరాపై సమీక్ష చేపట్టనున్న అమెరికా
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ కు పంపకుండా ఉన్న ఆయుధాలపై సమీక్ష చేయాలని రక్షణ రంగ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. అటు, ఆఫ్ఘనిస్థాన్ కు ఇవ్వాలని భావించిన 950 కోట్ల డాలర్ల ఆర్థికసాయాన్ని అమెరికా ఇప్పటికే నిలుపుదల చేసింది. తాలిబన్ల చేతికి ఆ నిధులు అందితే జరిగే పర్యవసానాల పట్ల అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది.
Comments
Post a Comment