హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..!

... తెలంగాణలో మరో 2 నెలల తర్వాతే ఎన్నికలు ... కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన తెలంగాణ సర్కార్ ... ముంచుకొస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ భయం K.Ashok Reddy, Senior Journalist Hyderabad. ఏఆర్ మీడియా/ ఏషియన్ మీడియా, హైదరాబాద్: జులై 31 తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నెలల వరకు ఇలాంటి ఎన్నికలు లేనట్టే.. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో కోవిడ్ పుణ్యమా అంటూ ఎన్నికలకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో "ఢీ అంటే ఢీ" అనే స్థాయిలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకున్నది. యావత్ రాష్ట్రం హుజరాబాద్ ఉప ఎన్నికపై దృష్టిని కేంద్రీకరించిన నేపథ్యంలో, కోవిడ్ వైరస్ వల్ల మరో రెండు నెలల పాటు తెలంగాణలో జరగాల్సిన అన్ని ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. ఇప్పటికే కోవిడ్ వల్ల అతలాకుతలమైన రాష్ట్రంలో మరోమారు ఎన్నికలు నిర్వహించి ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఇటీవల కాలంలో జిహెచ్ఎంసి, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కోవిడ్ సెకండ్ వేవ్...