Posts

'Dekho Apna Desh', a scheme aimed at encouraging locals to visit domestic tourism sites, would be launched shortly.

Image
Asian Media Network Thirupathi  August19, : Union Minister for Tourism and Culture, G. Kishan Reddy, on Thursday accused the Andhra Pradesh government of repackaging Central government projects and claiming credit for them. Speaking to the media here, Reddy said that except for Central government programmes, there has been no development in the YSRCP-ruled state. Stating that the Central government has been sanctioning funds and schemes rationally, the Union minister said that the state government's failure to contribute its share of funding has resulted in the delay of many Central schemes that were cleared long back. Reddy also recounted the support extended by the Central government to the state in facing the Covid pandemic. "In addition to vaccine doses required by the state, the Centre also provided 4,500 ventilators to Andhra Pradesh during the peak of Covid-19," he said. Speaking of his ministry's plans, Reddy said that 'Dekho Apna Desh', a scheme aimed

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్

Image
Asian Media Network   ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన గతంలో ఆఫ్ఘన్ సైనికులకు ఆయుధాలిచ్చిన అమెరికా ఇప్పుడా ఆయుధాలు తాలిబన్ల పరం ఆయుధ సరఫరాపై సమీక్ష చేపట్టనున్న అమెరికా ఆఫ్ఘనిస్తానుకు అమెరికా సేనలు కొనసాగిన సమయంలో కుదిరిన ఒప్పందంపై పునఃసమీక్ష చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. ఆఫ్ఘన్ సేనలకు శిక్షణ ఇచ్చిన అమెరికా, అత్యాధునిక ఆయుధాలు కూడా అందించింది. అయితే ఇప్పుడు ఆ ఆయుధాలు తాలిబన్ల పరం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది . ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ కు పంపకుండా ఉన్న ఆయుధాలపై సమీక్ష చేయాలని రక్షణ రంగ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. అటు, ఆఫ్ఘనిస్థాన్ కు ఇవ్వాలని భావించిన 950 కోట్ల డాలర్ల ఆర్థికసాయాన్ని అమెరికా ఇప్పటికే నిలుపుదల చేసింది. తాలిబన్ల చేతికి ఆ నిధులు అందితే జరిగే పర్యవసానాల పట్ల అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది.

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

Image
  రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు.. భద్రతా బలగాలు షా రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు.. భద్రతా బలగాలు షాక్! ఏషియన్ మీడియా నెట్వర్క్ న్యూఢిల్లీ ఆగస్టు 3 పూర్వకాలంలో పావురాల ద్వారా రాజులు తమ సందేశాలను పంపేవారు. గూఢచర్యంలో పావురాలను మించిన సమాచార సాధనం అప్పట్లో మరొకటి ఉండేది కాదు. పద్రాగస్టు వేడుకల్లో విధ్వంసానికి కుట్రలు. పాక్ సరిహద్దుల్లో అప్రమత్తమయిన సైన్యం. అనుమానస్పదరీతిలో డ్రోన్లు, పావురాల కదలికలు . స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమమత్తయాయి. మరోవైపు సరిహద్దుల్లో డ్రోన్‌లు కలకలం కొనసాగుతుండగా.. రాజస్థాన్ సరిహద్దుల్లో దొరికిన ఓ పావురం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని బికనీర్‌ జిల్లాలో చిక్కిన పావురం రెక్కలు, కాళ్లపై మొబైల్ నంబర్ రాసి ఉండటం పోలీసులు గుర్తించారు. అది పాకిస్థాన్ మొబైల్ నంబర్ కావడంతో నిఘావర్గాలు దర్యాప్తు చేపట్టాయి. పావురం రెక్కలపై మొబైల్ నంబర్‌తో పాటూ అక్టోబరు అని రాసి ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అక్టోబరులో పెద్

హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..!

Image
... తెలంగాణలో మరో 2 నెలల తర్వాతే ఎన్నికలు ... కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన తెలంగాణ సర్కార్ ... ముంచుకొస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ భయం K.Ashok Reddy, Senior Journalist Hyderabad.   ఏఆర్ మీడియా/ ఏషియన్ మీడియా,  హైదరాబాద్: జులై 31   తెలంగాణ రాష్ట్రంలో  మరో రెండు నెలల వరకు ఇలాంటి ఎన్నికలు లేనట్టే..  ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో కోవిడ్ పుణ్యమా అంటూ ఎన్నికలకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో "ఢీ అంటే ఢీ" అనే స్థాయిలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకున్నది. యావత్ రాష్ట్రం హుజరాబాద్ ఉప ఎన్నికపై దృష్టిని కేంద్రీకరించిన నేపథ్యంలో, కోవిడ్ వైరస్ వల్ల మరో రెండు నెలల పాటు తెలంగాణలో జరగాల్సిన అన్ని ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. ఇప్పటికే కోవిడ్ వల్ల అతలాకుతలమైన రాష్ట్రంలో మరోమారు ఎన్నికలు నిర్వహించి ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఇటీవల కాలంలో జిహెచ్ఎంసి, దుబ్బాక,  నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కోవిడ్ సెకండ్ వేవ్ దాటికి ప్రజల ప్రాణ

మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అస్వస్థత ...అరగంట కొచ్చిన 108

Image
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఈటెల రాజేందర్  అరగంట తర్వాత అందిన ప్రాథమిక వైద్యం ఈటల ప్రాణాల మీదకు తెచ్చిన పిఆర్వో నిర్వాకం .. పాదయాత్రలో ఎమర్జెన్సీ మెడికల్ కిట్ లేకపోవడం వల్లే ఈ దుస్థితి  ...అనుభవరాహిత్యం తో తప్పుదారి పట్టిస్తున్న పిఆర్ఓ  ..జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు..?  ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా,  హైదరాబాద్:జులై 30   ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు సుదీర్ఘ పాదయాత్ర చేపడితే మెడికల్ పరంగా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్ల ఎన్నో అనర్ధాలు  చోటుచేసుకుంటాయి. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ చేస్తున్న ప్రజా దీవెన పాదయాత్ర లో ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది లేకపోవడం, దానికి సంబంధించిన వైద్య పరికరాలను సైతం సమకూర్చు కోకుండా చేయడంవల్ల ఈ ప్రమాదం సంభవించింది . పాదయాత్రలో కచ్చితంగా అత్యవసర మెడికల్ సిబ్బందితో కూడిన వాహనాన్ని వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందులో  ఒక వైద్య అధికారితో పాటు ముగ్గురు సహాయకులు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవేమి గ్రహించకుండా ఇలాంటి పాదయాత్రలు చేయడం ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే అవుతుంది. రోజుకి దాదాపు రూ.  లక్షలు ఖర్చుపెట్టే పాదయాత్రలో మెడికల్ సిబ్బంద

పోలీస్ కార్యాలయాలు, స్టేషన్లలో పరిశుభ్ర, మెరుగైన సేవలకుగాను 5-ఎస్ విధానం అమలు - డి.జి.పి మహేందర్ రెడ్డి

Image
ఆసియన్ మీడియా నెట్వర్క ఏ విజయేందర్ రెడ్డి  స్పెషల్ కరస్పాండెంట్  హైదరాబాద్, జులై 28:*   రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ తో పాటు పోలీసు కార్యాలయాలను పరిశుభ్రమైన, మెరుగైన సేవలందించేందుకు అనువైన వాతావరణం ఉండేందుకు Sort, Set In Order, Shine, Standardize, Sustain అనే 5-S విధానాన్ని అమలు చేస్తున్నట్లు డి.జి.పి మహేందర్ రెడ్డి తెలియజేశారు . 5-ఎస్ అమలు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ కార్యాలయాలు, స్టేషన్లలో వ్యర్థ వస్తువుల తొలగింపు, విధి నిర్వహణకై పోలీసులకు అందజేసే కిట్ ల పంపిణీకి రూపొందించిన వెబ్ అప్లికేషన్ నిర్వహణ తదితర అంశాలపై నేడు రాష్ట్రంలోని 9 పోలీస్ కమిషనరేట్లు,  20 జిల్లాల ఎస్.పి కార్యాలయాల ఆర్.ఐ లతో సమావేశం నిర్వహించారు. లాజిస్టిక్స్ విభాగం ఐ.జి సంజయ్ జైన్, స్టోర్స్ డి.ఎస్.పి వేణుగోపాల్ లు హాజరైన ఈ సమావేశంలో డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలులో భాగంగా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, పోలీసు కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఉత్తమ సేవలు అందించే వాతావరణం కల్పించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ 5-ఎస్ విధానం రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలు, పోలీస

కార్గిల్ యుద్ధ వీరుడు కమాండర్ మనోజ్ పాండే ..

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్  న్యూస్ డెస్క్ జూలై 28 "1997 ..1/11 గూర్ఖారెలిజిమెంట్ ..దుర్గాపూజ జరుగుతుంది..జవానులంతా ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు.కొత్తగా కంపెనీలోనికి జాయిన్ అయిన 22 యేండ్ల యువజవాన్ పిలిచాడు కల్నల్ .అతని చేతిలో "ఖుఖ్రీ" (ముఖాముఖి పోరులో మన జవాన్స్ ఉపయోగించే అత్యంత ఉపయోగకరమైన ఆయుధం అది. శత్రువుల తలలనూ సహితం వేరుచేయడం నేర్పుతారు దానితో) పెట్టి ఒకమేకపోతును చూపుతూ నీ మనసులో కోరిక కోరుకొని దానిని బలి ఇవ్వూ నీ కోరిక తీరుతుందన్నాడు.ఒకక్షణం తటపటాయించాడాయువకుడు.తర్వాత ఖుఖ్రీతో మేకతలను వేరుచేసాడు..అతని మొహమంతా మేకరక్తంచిమ్మ ఎర్రబడింది.గిలగిలకొట్టుకుంటూ ప్రాణం విడుస్తున్న మేక వైపు తథేకంగా చూసాడాయుకువకుడు.మౌనంగా తన గుడారానికెళ్ళాడు.ఏదో అపరాధభావం. నాలుగైదుసార్లు ముఖం కడుక్కొన్నాడు..ఆ సంఘటన తరువాత మళ్ళీ జీవితంలో మాంసం మద్యం జోలికిపోకూడదనుకున్నాడు..అలాగే ఉండిపోయాడు.     అయితే 14 నెలలు గడిచేసరికే అతను శత్రువులను నిర్ధాక్షణ్యంగా ముట్టుబెట్టేస్తాయికి ఎదిగాడు.కరుడుగట్టిన కమెండోగా మారిపోయాడు. చాలా ఆపరేషన్స్ లో పాల్గొని కరుడుగట్టిన ఉగ్రవాదులను కాల్చిచంపాడు..ఎన్నో రిస్క్యూ ఆప

అగ్రహీరోలు అస్సలు ఒప్పుకోరు వారి మైండ్ సెట్ మారాలి... ప్రముఖ నటి తాప్సీ

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్  సినిమా డెస్క్ హైదరాబాద్ జూలై 27 హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టమని హీరోయిన్ తాప్సి చెప్పింది. మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశాలతో తెరకెక్కించే సినిమాలను జనాలకు చేరువ చేయడంలో చాలా కష్టాలు ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో నటించేందుకు టాప్ హీరోలు ఒప్పుకోరని... వారి పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని వారు భావిస్తుంటారని చెప్పింది.  కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి... వారి హీరో ఇమేజ్ తగ్గిపోతుందని భయపడతారని తెలిపింది. అదే హీరోయిన్లు అయితే కథలో కీలకంగా ఉండే చిన్న పాత్రనైనా ఒప్పుకుంటారని చెప్పింది . ఈ విషయంలో అగ్ర హీరోలు వారి మైండ్ సెట్ మార్చుకోవాలని తాప్సి హితవు పలికింది. హీరో,  హీరోయిన్లు ఇమేజ్ పట్టింపులను వదిలేసి సమన్వయంతో పని చేస్తే ఎన్నో మంచి చిత్రాలు వస్తాయని తెలిపింది . అప్పుడే సినీ పరిశ్రమలో మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పింది. ప్రస్తుతం తాప్పి చాలా బిజీగా ఉంది. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళంలో తొమ్మిది చిత్రాల్లో నటిస్తోంది.

యండమూరి వీరేంద్రనాథ్ తాజా చిత్రం"అతడు-ఆమె-ప్రియుడు"

Image
ఏషియన్ మీడియా నెట్వర్క్  హైదరాబాద్ జూలై 24 మర్యాద రామన్న సునీల్ హీరోగా  రచనా సంచలనం యండమూరి  తాజా చిత్రం "అతడు-ఆమె-ప్రియుడు" # "నల్లంచు తెల్లచీర"కు గుమ్మడికాయ-  అతడు-ఆమె ప్రియుడు"కు  కొబ్బరికాయ కొట్టిన యండమూరి  ముఖ్య అతిథులుగా హాజరైన నాగబాబు-కోదండరామిరెడ్డి- "మాతృదేవోభవ" అజయ్ కుమార్  అంబికా కృష్ణ     ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "నల్లంచు తెల్లచీర" చిత్రానికి ఇటీవల గుమ్మడికాయ కొట్టిన యండమూరి... తాజాగా "అతడు-ఆమె-ప్రియుడు" చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. 'మర్యాద రామన్న' సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా... మహేశ్వరి వడ్డి- ప్రియాంక-సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న "అతడు... ఆమె ప్రియుడు' చిత్రాన్ని... సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ క్రేజీ చిత్రానికి కూనం కృష్ణకుమారి-కూనం ఝాన్సీ (యు.ఎస్.ఏ) సహ నిర్మాతలు.       "మొన్న చాట

అందురాలిగా నయనతార..

Image
  ఏషియన్ మీడియా నెట్వర్క్  తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకి విపరీతమైన క్రేజ్ ఉంది. కొంతకాలంగా ఆమె నాయిక ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. అలా ఆమె చేసిన సినిమానే 'నేత్రికన్'. ఈ సినిమాలో ఆమె అంధురాలిగా కనిపిస్తుంది. అందమైన అమ్మాయిలను వేటాడి వరుస హత్యలు చేసే ఒక కిల్లర్ బారి నుంచి నాయిక ఎలా తప్పించుకుంది? ఆ కిల్లర్ కథకి ఆమె ఎలాంటి ముగింపు పలికింది? అనేదే కథ. హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో మిలింద్ రావ్ సిద్ధహస్తుడు. ఆయన ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా 'డిస్నీ హాట్ స్టార్' ద్వారా విడుదల కానుందనే వార్తలు ఇటీవల వినిపించాయి . ఆ తరువాత ఆ ప్రస్తావన ఎక్కడా లేకపోవడంతో అందులో నిజం లేదనుకున్నారు. కానీ ఈ సినిమాను తాము రిలీజ్ చేయనున్నట్టు నిన్న హాట్ స్టార్ వారు స్పష్టం చేశారు. నయనతార నాయిక ప్రధానమైన సినిమా అంటే, కొత్తదనంతో కూడిన కంటెంట్ ఉంటుందనే నమ్మకం అందరిలో ఉంది. జయాపజయాల సంగతి అటుంచితే, ఆమె ఎంచుకున్న కథలు .. పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇక నయనతార ఏ పాత్రలో ఉన్నా, ఆ పాత్ర తప్ప తెరపై ఆమె కనిపి

విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!

Image
  ఏషియన్ మీడియా నెట్వర్క్ విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట అమ్మ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ అమ్మవారు చేసిన మహిమలు కోకొల్లలు.. కనకదుర్గమ్మ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆ తల్లి కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది.. ఢిల్లీ వెంకన్న రిక్షాలో కనక దుర్గ మాత విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు.. అది 1955వ సంవత్సరంఅప్పట్లో రోజులు మారాయి  సినిమా విడుదల అయ్యింది.. ఢిల్లీ వెంకన్న రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు సినిమా అయిపోయిన తర్వాత రిక్షాలో వెళ్లాలనుకునే వారికి అతను అందుబాటులో ఉండే వాడు వారు కోరుకున్న ప్రాంతానికి రిక్షాలో తీసుకెళ్లేవాడు ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక మహిళ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది.. అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ