భారత్ లో 40 కోట్ల ప్రజలకు వైరస్ ముప్పు

* 68% మందిలో కరోనా యాంటీబాడీలు* ఇంకా 40 కోట్ల ప్రజలకు వైరస్ ముప్పు *ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడి* ఏషియన్ మీడియా నెట్వర్క్ న్యూ ఢిల్లీ :జులై22 దేశంలో ఇప్పటివరకు మూడింట రెండొంతుల మంది కొవిడ్‌కు గురైనట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్-జులై నెలల్లో నిర్వహించిన నాలుగో సీరో సర్వేను అనుసరించి ఈ విషయం వెల్లడిస్తున్నట్లు ప్రకటించారు . ఇదివరకు నిర్వహించిన మూడు సర్వేలకు భిన్నంగా ఈసారి 6-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు సహా మొత్తం 28,975 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న పెద్దల్లో 12,607 మంది (62.2%) ఎలాంటి టీకా తీసుకోలేదని, 5,038 మంది (24.8%) ఒక డోసు, 2,631 మంది (13%) రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు . మొత్తంగా 67.6% మందిలో యాంటీబాడీలు కనిపించినట్లు చెప్పారు. 6-9 ఏళ్ల వయస్సులో 57.2%మందిలో, 10-17 ఏళ్ల వయస్సులో 61.6%, 18-44 వయస్సులో 66.7%, 45-6 ఏళ్ల వయస్సులో 77.6%, 60 ఏళ్ల పైబడిన వారిలో76.7% మందిలో యాంటీబాడీలు ఉన్నాయన్నారు. ...