Posts

ముంపు బాధితుల‌కు పాలు, ఆహార‌ ప్యాకెట్లు పంపిణీ చేసిన అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి

Image
ఏషియన్ మీడియా నెట్వర్క్  నిర్మల్ జూలై 23 నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ముంపు ప్రాంతాల్లో టీఆర్ఎస్ యువ‌జ‌న నాయ‌కులు అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి ప‌ర్య‌టించారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని జీఎన్ఆర్ కాల‌నీ ముంపు బాధితుల‌కు పాలు, ఆహార‌ ప్యాకెట్ల‌ను అంద‌జేశారు.  ముంపు బాధితుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... విపత్తుల సమయంలో తోటి వారికి సహాయం అందించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు . ఇలాంటి సమయంలో  ముందుకొచ్చి బాధితులకు బాసటగా నిలవాల్సిన బాధ్యత  మ‌నం అందిరిపై ఉందన్నారు. వరద బాధితులను ఆదుకునే  త‌మ వంతు స‌హకారం అందిస్తామ‌ని చెప్పారు . డైరీ చైర్మన్ లోకా భూమా రెడ్డి,తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, స్థానిక నాయకులు ఆన్వార్, అకోజి కిషన్, దశరత్,రవి తదితరులు ఉన్నారు..

హైదరాబాద్ కు ఎవరూ రావొద్దు..కె.టి ఆర్

Image
ఏషియన్ మీడియా నెట్వర్క్  హైదరాబాద్ జూలై 23 * తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు విజ్ఞప్తి* *వర్షాల నేపథ్యంలో, సీఎం గారి ఆదేశాల మేరకు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి* రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో రేపు తాను ఎవరిని కలవడం లేదని, ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు.  ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ,  మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనా

భారత్ లో 40 కోట్ల ప్రజలకు వైరస్‌ ముప్పు

Image
  * 68% మందిలో కరోనా యాంటీబాడీలు* ఇంకా 40 కోట్ల ప్రజలకు వైరస్‌ ముప్పు *ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడి*  ఏషియన్ మీడియా నెట్వర్క్   న్యూ ఢిల్లీ :జులై22    దేశంలో ఇప్పటివరకు మూడింట రెండొంతుల మంది కొవిడ్‌కు గురైనట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్‌-జులై నెలల్లో నిర్వహించిన నాలుగో సీరో సర్వేను అనుసరించి ఈ విషయం వెల్లడిస్తున్నట్లు ప్రకటించారు . ఇదివరకు నిర్వహించిన మూడు సర్వేలకు భిన్నంగా ఈసారి 6-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు సహా మొత్తం 28,975 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న పెద్దల్లో 12,607 మంది (62.2%) ఎలాంటి టీకా తీసుకోలేదని, 5,038 మంది (24.8%) ఒక డోసు, 2,631 మంది (13%) రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు . మొత్తంగా 67.6% మందిలో యాంటీబాడీలు కనిపించినట్లు చెప్పారు. 6-9 ఏళ్ల వయస్సులో    57.2%మందిలో, 10-17 ఏళ్ల వయస్సులో 61.6%, 18-44 వయస్సులో 66.7%, 45-6 ఏళ్ల వయస్సులో 77.6%, 60 ఏళ్ల పైబడిన వారిలో76.7% మందిలో యాంటీబాడీలు ఉన్నాయన్నారు. పురుషుల్లో 65.8% మందిలో సీరో పాజిటివిటీ

అనుష్కకు పదహారేళ్లు...!

Image
 ఏషియన్   మీడియా నెట్వర్క్  హై దరాబాద్ జూలై 22  అందమైన అభినయానికి మరో పేరే అనుష్క. నాగార్జున హీరోగా చేసిన 'సూపర్' సినిమా ద్వారా తెలుగు తెరకి ఆమె పరిచయమైంది. నాగార్జున చాలామంది కథానాయికలను తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. అలా పరిచయమైన కథానాయికల్లో అగ్రస్థానానికి చేరిన నాయికగా అనుష్క నిలిచింది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 20వ తేదీతో ఈ సినిమా 16 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అనుష్క స్పందించింది. ఈ సినిమాతో తనకి అవకాశం ఇచ్చిన నాగార్జున .. పూరి జగన్నాథ్ కి ఆమె థ్యాంక్స్ చెప్పింది. అలాగే తనతో కలిసి పనిచేసిన సోనూసూద్ తో పాటు అందరికీ కూడా ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఇక ఈ 16 ఏళ్లలో తనని సపోర్ట్ చేస్తూ, ఇంతగా ఆదరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. ఈ 16 ఏళ్ల కెరియర్లో అనుష్క ఎన్నో విజయాలను సాధించింది. ఆమె అందానికీ .. అభినయానికి అభిమానులు కానివారు లేరు. తెలుగు .. తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరి సరసన అలరించింది. నాయిక ప్రధానమైన చిత్రాలలో తనకు తిరుగులేదనిపించింది. 'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 

ఫోన్ ల తో జాగ్రత్త ...అశ్రద్ధ గా ఉన్నామో మన వ్యక్తిగత జీవితం గుట్టురట్టు.!

Image
ఏషియన్ మీడియా నెట్వర్క్  By..A.Vijayender Reddy  న్యూఢిల్లీ జూలై 22 కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, మీడియా వ్యక్తులు సహా అనేక మంది ప్రముఖుల ఫోన్లను పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో హ్యాకింగ్ చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మన ఫోన్‌లో డేటా మొత్తాన్ని మన తెలియకుండా ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో హ్యాకర్లు చూసేస్తారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్‌ చాట్ ఇలా ఒకటేమిటి అన్నీ మనకు తెలియకుండానే వేరెవరో చూస్తుంటారు. అంతేకాదు, మన కెమెరాను కూడా మనకు తెలియకుండా ఆన్‌ చేసి మనం ఏం చేస్తున్నామో కూడా చూడగలరు. హ్యాకింగ్‌, స్పైయింగ్‌లో పెగాసస్ అనేది అత్యంత శక్తిమంతమైన, అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్. అయితే ఇదొక్కటే కాదు మన ఫోన్లను హ్యాక్ చేసి, మనం ఏం చేస్తున్నామో స్పై చేసే స్పైవేర్, మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్లు చాలానే ఉన్నాయి.వీటి సాయంతో హ్యాకర్లు సామాన్య ప్రజల ఫోన్లను కూడా టార్గెట్ చేసి, మన పర్సనల్ డేటా మొదలు బ్యాంకు వివరాలు అన్ని తెలుసుకునే ప్రమాదం ఉంది. హ్యాకర్లు మన ఫోన్‌ను ఎక్కోడ ఉండి ఆపరేట్‌ చేసే టెక్నాలజీలు కూడా ఉన్నాయని టెక్నాలజీ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. వాళ్లు మన ఫోన్‌ ఆపరేట్ చేస్తున్నట్లు కూడా తెలియకుండానే ఇదంతా

పెగాసస్ నిఘా ఆరోపణలపై సిట్ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్

Image
ఏషియన్ మీడియా నెట్వర్క్ న్యూఢిల్లీ : జూలై 22 పెగాసస్ స్పైవేర్‌తో ప్రభుత్వ సంస్థలు కొందరిపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయించాలని కోరింది. పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని వివరించింది.  అడ్వకేట్ ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, పెగాసస్ కుంభకోణం చాలా తీవ్రమైనదని పేర్కొన్నారు. ఇది భారత దేశ ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, దేశ భద్రతలపై తీవ్రమైన దాడి అని తెలిపారు. నిఘాను విస్తృతంగా, యథేచ్ఛగా, జవాబుదారీతనం లేకుండా ఉపయోగించడం నైతికంగా వికృతమని ఆరోపించారు. వ్యక్తిగత గోప్యత అంటే దాచిపెట్టాలనే కోరికకు సంబంధించినది కాదని, ఒకరి సొంతానికి ఉండే వ్యక్తిగత పరిధికి సంబంధించినదని పేర్కొన్నారు. మన భావాలు, ఉనికి వేరొకరి ప్రయోజనాలకు సాధనం కానటువంటి పరిధి వ్యక్తిగత పరిధి అని పేర్కొన్నారు. మర్యాద, మంత్రాంగంలో ముఖ్యమైన భాగం ఇదని తెలిపారు.  పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం కేవలం ఓ వ్యక్తి సంభాషణలను చాటుగా వినడం మాత్రమే కాదని, ఆ వ్

నాగార్జునసాగర్ జలాశయం లో నీటి కుక్కలు

Image
ఏషియన్ మీడియా నెట్వర్క్  నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా జూలై 22 _* నాగార్జున సాగ‌ర్‌ జలాశయంలో ‘నీటి ‌కు‌క్కల’ సందడి*_  నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు దర్శనం ఇచ్చాయి..... ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ జలాశయంలోకి ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైంది...  దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్‌‌లోని వాటర్ స్కెల్ సమీపంలో దర్శనమిచ్చాయి... ★ అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకొని నీళ్లలోనే జీవిస్తాయి... ★ నీళ్ల లోపల ఈదుతాయి ... నీళ్ల లోపల, నీళ్ల బయట జీవిస్తాయి .. ఉభయ చర జీవులు ఇవి...  ★ నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు ...

నిండా ముంచుతున్న పిఏ, పిఆర్వో లు ... ఈటల పాదయాత్రకు కొరవడిన పబ్లిసిటీ

Image
. .. ప్రజా స్పందన ఉన్నా మలుచుకోలేని దుస్థితి   ... రూ. లక్షలు ఖర్చు చేస్తున్న ప్రయోజనం శూన్యం   By: K. AshokReddy.  Senior journalist, ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా  హైదరాబాద్:జులై22...   రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకట్టుకుంటు హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు, ఇతర పార్టీల నుంచి తీవ్రమైన ఆటంకాలు, ఎదురు దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఈటెల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన పీఏ, పీఆర్ఓ ల నిర్వాహకం వల్లే అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. రూపాయల ఖర్చుతో చేపడుతున్న పాదయాత్ర ప్రచార కార్యక్రమం ఆశించిన స్థాయిలో లో ప్రజా స్పందన ను తీసుకు రావడం లేదు. ప్రజల నుంచి ఈటెల పై అపారమైన సానుభూతి ఉన్నప్పటికీ, దానిని, తమకు అనుకూలంగా మలచుకునే విధంగా చేయడంలో విఫలమవుతున్నారని స్థానికులు వాపోతున్నారు . దీనికి ప్రధాన కారణంగా తన దగ్గర పనిచేసే పిఆర్ఓ  చేస్తున్న నిర్వాకం వల్లనే ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 19న నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిన ఈటల రాజేందర్ కు మీడియా పరంగా ఆశించిన ప్రచారం రావడం లేదు. 25 రోజుల పాటు సాగే పాదయాత్రలో ప్రజలను ఆకట్టుక

ఈ రోజు నుండి పెరిగిన భూముల రెజిస్ట్రేషన్ చార్జీలు

Image
ఏషియన్ మీడియా నెట్వర్క్ హైదరాబాద్ జూలై 22 రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల మార్కెట్‌ విలువను గరిష్ఠంగా 50, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల విలువను గరిష్ఠంగా 30 శాతం పెంచారు. కొత్తగా నిర్ణయించిన భూముల ధరలు, పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు గురువారం నుంచి జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది . రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు, రుసుం చెల్లించిన వారు కూడా కొత్త ఛార్జీల మేరకే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు 58, 59, 60లను జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 2013 ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి అమలవుతున్నాయి. గత ఏడాది జనవరిలోనే విలువలు, ఛార్జీల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు భూముల వి

నారప్ప కు మంచి రెస్పాన్స్ వస్తోంది

Image
  వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'నారప్ప', నిన్ననే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. తమిళంలో ధనుశ్ చేసిన 'అసురన్'కి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా హిట్ కావడమే కాకుండా, నటన పరంగా ధనుశ్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఇక తెలుగులో విడుదలైన 'నారప్ప'కు కూడా మంచి రెస్పాన్ వస్తోంది. ఈ విషయంపై తాజాగా వెంకటేశ్ స్పందించారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందనీ, ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. ఇంతగా ఈ సినిమాను ఆదరిస్తున్నవారికి థ్యాంక్స్ చెప్పారు. 'నారప్ప' ఒక సాధారణమైన రైతు. తనకున్న 3 ఎకరాల పొలంతో జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. పండుసామి అనే వ్యక్తి ఆ కాస్త పొలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకు అడ్డొచ్చిన నారప్ప పెద్ద కొడుకును చంపేస్తాడు. ఆ కోపంతో నారప్ప చిన్నకొడుకు, ఎవరూ ఊహించని పని చేస్తాడు. దాంతో అతణ్ణి తీసుకుని అడవుల్లోకి నారప్ప పారిపోతాడు. ఆ తరువాత చోటుచేసుకునే మలుపులతో కథ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. బలమైన కథాకథనాల వల్లనే ఈ సినిమా ఈ స్థాయి ఆదరణ పొందుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంగ్లీ బోనాల పాట పై హిందూ సంఘాల ఆగ్రహం

Image
  ఏషియన్ మీడియా నెట్వర్క్ హైదరాబాద్ జూలై 21 * సింగర్ మంగ్లీపై పిర్యాదు* హైదరాబాద్‌లో సింగర్ మంగ్లీపై బీజేపీ కార్పొరేటర్లు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని, సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. పండుగల సందర్భంగా మంగ్లీ పాడిన ప్రత్యేక గీతాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ నెల 11న మంగ్లీ పాడిన బోనాల పాట విడుదల అయింది. ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ‘చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా’ అంటూ ఈ పాట సాగుతూ ఉంటుంది. అయితే ఈ పాట లిరిక్స్ హిందూ దేవతలను కించపరిచేలా ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి

అమిత్ షా తో రఘురామ భేటీ

Image
  అమిత్ షాతో రఘురామ భేటీ.. కీలక అంశాలపై చర్చ ఏషియన్ మీడియా నెట్వర్క్, న్యూఢిల్లీ జులై21 కేంద్రహోంమంత్రి అమిత్ షాతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రఘురామ ఆరోగ్య పరిస్థితులపై అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆయన కీలక ఆరోపణలు చేశారు. దీంతో రఘురామపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో రఘురామ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. జగన్ బెయిల్ రద్దుకు మద్దుతివ్వాలని రఘురామ పలువురు ఎంపీలకు రఘురామ లేఖలు రాశారు. దీంతో రఘురామ వర్సెస్ వైసీపీగా మారింది. అటు రఘురామపై అనర్హత వేయాలని వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చే

ఆగస్టు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న"క్షీరసాగర మథనం*

Image
  పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల  సంయుక్త కథనం *క్షీరసాగర మథనం* ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల ఏషియన్ మీడియా నెట్వర్క్  హైదరాబాద్ జూలై 20     ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పని చేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం "క్షీరసాగర మథనం". సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో అత్యంత ఆహ్లాదకరంగ రూపొందిన 'క్షీర సాగర మథనం' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6... థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.      చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల, దేవా కట్టా, మధుర శ్రీధర్ రెడ్డి వంటి సాఫ్ట్ వేర్ టర్నడ్ డైరెక్టర్స్ ను స్ఫూర్తిగా తీసుకుని సాఫ్ట్ వేర్

The man who insulted the RSS chief held a key position in the Bharatiya Janata Party National Yuva Morcha

Image
  Lack of discipline in the BJP The man who insulted the RSS chief held a key position in the Bharatiya Janata Party National Youth Morcha .. Sangh Parivar expressing anger By: K.AshokReddy, Senior Journalist, Hyderabad.  AR Media / Asian Media,  Hyderabad: July 18 In the BJP, which is nicknamed Discipline, it is giving priority to the paramilitaries. Even the BJP, which boasts of being a nickname for discipline that is different from all political parties, is also buying positions with piracy. Moreover, the party has grown day by day with discipline under the guidance of RSS chief Mohan Bhagwat, the parent and parent body of the BJP. The Bharatiya Janata Party, which was started in 1980, has now risen to the level of ruling the country. She selected leaders with great discipline and joined the party. Continuing this tradition, it has been gaining popularity and achieving success. At a time like this, taking 'jumping japangs' in Telangana and tying up positions is tarni

తొలి ఏకాదశి అంటే ఏమిటి...?

Image
హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది.    తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాడ శుద్ధ ఏకాదశిని *“తొలి ఏకాద‌శి”* అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి.  ఏకాదశి అంటే పదకొండు అని అర్థం.  మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు.  ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి – విశిష్టత ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు.  దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు.  ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు.  కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే ,  ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు ,  సూర్య చంద్రులు ,  గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్