తెలంగాణలో "రాజన్న రాజ్యం" కోరింది ఎవరు..?.

షర్మిలమ్మ ఏంది నీ డ్రామా ..? తెలంగాణలో నీ అస్తిత్వం ఏంటి..? .. మరోమారు "జాగో భాగో" కు సిద్ధంగా ఉండు.. ..త్వరలో మళ్లీ మానుకోట గతి తప్పదు.. షర్మిలకు తెలంగాణవాదుల ఘాటు హెచ్చరిక By: K.AshokReddy, Senior Journalist Ph: 9603322489 ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా హైదరాబాద్ :june30 షర్మిలమ్మ ఏంది నీ డ్రామా కంపెనీ... అసలు నీవు పెట్టే డ్రామా కంపెనీ లో బుడ్డర్ఖాన్ లు ఉన్నారా.. అయితే, వారితో జోకులు వేయించుకొని కాలం గడుపు.. అంతేకానీ తెలంగాణ జోలికి వస్తే మరోమారు "జాగో భాగో" నినాదంతో తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో సమైక్యవాదిగా ఉన్న మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తెలంగాణ వాదులు మానుకోట రాళ్ల దాడి చేసిన ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకో... ఈ సంఘటన కు మించిన ప్రతిఘటన ను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తెరిగి మసలు కోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో "రాజన్న రాజ్యం" కోరింది ఎవరు..? అసలు తెలంగాణలో "రాజన్న రాజ్యం' కావాలని అడిగింది ఎవరో చెప్పాల్సిన అవసరం షర్మిల పై ఉంది. ఆదినుంచి తెలంగాణకు అన్యాయం ...