పిసిసి అధ్యక్షుడిగా పొలిటికల్ రెబల్ స్టార్

పిసిసి అధ్యక్షుడిగా రేవంత్... ....కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా వల్లనే ఎంపిక ఏఆర్ మీడియా/ ఏషియన్ మీడియా హైదరాబాద్ : జూన్ 22 తెలంగాణ కాంగ్రెస్ కొత్త రథసారథి ఎంపిక ఫైనల్ అయ్యింది. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉండి, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా గుర్తింపు ఉన్నప్పటికీ ఎన్నికల పోరులో వెనుకబడుతున్న కాంగ్రెస్ ను తిరిగి గాడిన పెట్టగల నాయకుడిగా రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. రెండు సంవత్సరాలుగా జరుగుతున్న తర్జనభర్జనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది .పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఖరారు చేయటంతో పాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనుంది. సామాజిక వర్గాల సమతుల్యతతో పాటు పార్టీకి విధేయులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, కొండా సురేఖ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీలను ఎంపిక చేసింది.సీఎం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనే వ్యక్తే ఇప్పుడున్న సమయంలో నాయకుడిగా ఉండాలన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పేరును ...